వీడియో వైరల్.. బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టి..
కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉంటాయి. స్పీడ్ డ్రైవింగ్ ఎంతటి ప్రమాదాన్ని తీసుకువస్తోంది మరోసారి రుజువు చేసింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా సాల్ట్ లేక్ ప్రాంతంలో సోమవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కారును ఢీకొట్టడంతో కనీసం 10 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ క్లిప్‌లో, వేగంగా వచ్చిన బస్సు అదుపుతప్పి కారును ఢీకొట్టింది.
స్థానికుల కథనం ప్రకారం బస్సు సిగ్నల్ జంప్ చేసింది. మరోవైపు నిలబడి ఉన్న ఇద్దరు బైకర్లు తృటిలో తప్పించుకున్నారు. వారు ధరించిన హెల్మెట్‌ల వల్ల వారికి తీవ్ర గాయాలు కాలేదని నివేదికలు పేర్కొన్నాయి. కారులో ఉన్న వారికి కూడా పెద్దగా గాయాలు కాలేదు. రాష్ట్రంలోని ఐటీ హబ్ అయిన సాల్ట్ లేక్ సెక్టార్ V వద్ద కాలేజ్ మోర్ సమీపంలో ఉదయం 7.15 గంటలకు రెండు బస్సులు ఒకదానికొకటి ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "రెండు బస్సులను నిర్లక్ష్యంగా నడుపుతూ ఒకదానికొకటి అధిగమించేందుకు ప్రయత్నించారు. ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
#Kolkata's Saltlake area, accident captured on CCTV camera in which a speeding bus collides with a car pic.twitter.com/eDPkCi7Jhg
— Dheeraj Singh (@dheeraj_journo) October 5, 2023
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com