Spider Man Comic: అది కేవలం ఒక పేపర్.. కానీ దాని ధర రూ. 24 కోట్లు..

Spider Man Comic: అది కేవలం ఒక పేపర్.. కానీ దాని ధర రూ. 24 కోట్లు..
Spider Man Comic: ఫిక్షనల్ క్యారెక్టర్స్‌లో చాలామందికి ఇష్టమైన క్యారెక్టర్‌లలో ఒకటి స్పైడర్ మ్యాన్.

Spider Man Comic: నచ్చిన వస్తువులను వేలం పాట వేస్తే.. అవి ఎంత ధర పెట్టి కొనడానికి అయినా.. వెనకాడరు కొందరు. ముఖ్యంగా తమకు నచ్చిన సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులు అయితే.. ఇక వేలంలో వెనక్కి తగ్గే సమస్యే లేదు అనుకుంటారు. తాజాగా అలా అనుకొని ఓ స్పైడర్ మ్యాన్ అభిమాని.. ఆ క్యారెక్టర్‌కు సంబంధించిన కామిక్ పేజీని ఏకంగా రూ. 24 కోట్లు పెట్టి వేలంపాటలో కొన్నాడు.

ఫిక్షనల్ క్యారెక్టర్స్‌లో చాలామందికి ఇష్టమైన క్యారెక్టర్‌లలో ఒకటి స్పైడర్ మ్యాన్. ఇప్పటికీ స్పైడర్ మ్యాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ మధ్య విడుదలయిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌కు ఇండియాలో వచ్చిన కలెక్షన్సే దీనికి ఉదాహరణ. అందుకే 1984 నాటి స్పైడర్ మ్యాన్ కామిక్ పేజీని కొనడానికి కూడా కోట్లు పెట్టడానికి ఆలోచించలేదు ఓ వ్యక్తి.

స్పైడర్ మ్యాన్ పాత్ర క్రియేట్ చేసిన తర్వాత చాలాకాలం పాటు కామిక్ వరల్డ్‌లో కూడా మకుటం లేని మహారాజుగా వెలిగిపోయాడు. స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే ప్రాణం పోసిన ఈ పాత్రపై సినిమాలు తెరకెక్కించడమే కాకుండా.. ఎన్నో కామిక్ పుస్తకాలు కూడా రచించబడ్డాయి. అయితే 1984లో పబ్లిష్ అయిన సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్‌లోని 25వ పేజీ ఇప్పుడు ఏకంగా రూ. 24 కోట్లు వేలం పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tags

Next Story