వైరల్

Steve Mulligan Past Life: 'గత జన్మలో నేను పైలెట్.. నన్ను కాల్చి చంపేశారు..': వ్యక్తి ఆరోపణ

Steve Mulligan Past Life: మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను పైలెట్‌గా పనిచేశానని చెప్తున్నాడు స్టీవ్.

Steve Mulligan Past Life: గత జన్మలో నేను పైలెట్.. నన్ను కాల్చి చంపేశారు..: వ్యక్తి ఆరోపణ
X

Steve Mulligan Past Life: కొందరికి నిన్న ఏం జరిగిందో కూడా గుర్తుపెట్టుకోవడం నచ్చదు. కానీ కొందరికి మాత్రం గత జన్మలో ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు అదేమీ పెద్ద కష్టమైన విషయం కాదు. గత జన్మ గురించి తెలుసుకునే స్థాయికి టెక్నాలజీ పెరిగిపోయింది. కానీ అది అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. అయితే అలాంటి టెక్నాలజీతోనే తన గత జన్మ జ్ఞాపకాలను పూసగుచ్చినట్టు చెప్తున్నాడు ఓ వృద్ధుడు.

స్టీవ్ ముల్లిగాన్ అనే వ్యక్తి 1961లో నార్త్ వేల్స్‌లోని లాండుడ్నోలో జన్మించాడు. కానీ తనకు ఊహ తెలిసినప్పటి నుండి తనకు ఆ ప్రాంతంలో చాలా పరిచయం ఉన్నట్టు అనిపిస్తూ ఉండేదట. అంతే కాకుండా కొన్నేళ్ల క్రితం తను అక్కడే జీవించినట్టు, తనకు ఆ ప్రాంతం అంతా బాగా తెలుసు అన్నట్టు అనిపిస్తూ ఉండేదట. అయితే ఇవి గత జన్మ గుర్తులు అయ్యిండొచ్చన్న అనుమానంతో ఓ డాక్టర్‌ను కలిశాడట స్టీవ్.

ఆ డాక్టర్ వల్ల మరింత స్పష్టంగా స్టీవ్‌కు తన గత జన్మ గుర్తుకు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో తాను పైలెట్‌గా పనిచేశానని చెప్తున్నాడు స్టీవ్. అయితే విమానంలో ఇంధనం నింపుతుండగా తనను కాల్చి చంపేశారని, అలా తాను గత జన్మలో 24 ఏళ్లకే మరణించానని చెప్పాడు స్టీవ్. అంతే కాకుండా తన సమాధి దగ్గరకు కూడా వెళ్లి వచ్చాడు.


గత జన్మలో తన పేరు సిడ్నీ సట్‌క్లిఫ్ అని చెప్తున్నాడు స్టీవ్ ముల్లిగాన్. అంతే కాకుండా తన భార్యతో కలిసి గత జన్మలో తనను దహనం చేసిన చోటికి కూడా వెళ్లాడు. అక్కడ శిలాపథకంపై సిడ్నీ సట్‌క్లిఫ్ అనే పేరును గుర్తించాడు. అంతే కాకుండా తన తండ్రి ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని కూడా తెలిపాడు స్టీవ్. స్టీవ్ చెప్తు్న్న ఈ విషయాలు ఆశ్చర్యంగా ఉన్నా కొందరు వీటిని నమ్ముతున్నారు.Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES