sukhibhava Sharath : అందుకే నన్ను కొట్టారు.. 'సుఖీభవ' శరత్..!

sukhibhava Sharath : గతకొద్దిరోజులుగా సోషల్ మీడియాలో "అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. సుఖీభవ అంటూ ఓ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. నల్లగుట్ట శరత్ అనే యువకుడు ఓ టీపౌడర్ యాడ్ ని రీక్రియేట్ చేసి తనదైన శైలిలో తీన్మార్ స్టెప్పులు వేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. తాజాగా శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతుంది. దీనితో అతనిపైన ఎవరో దాడి చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపైన శరత్ స్పందించాడు. గతంలో తన సోదరిని వేధించిన వారిని కొట్టానని అప్పుడు జైలుకి వెళ్లానని చెప్పాడు.
జైలు నుంచి బయటకు వచ్చాక రెండు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని, సుఖీభవ వీడియోతో పాపులర్ అయితే దానిని తట్టుకోలేక వారే నన్ను విచక్షణారహితంగా కొట్టారని తెలిపాడు. దీనిపైన పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా వెల్లడించాడు. అటు హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశానని అందువల్ల హిజ్రాలు దాడి చేశారన్న వార్తలను శరత్ అవాస్తవం అని ఖండించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com