Viral: స్టూడెంట్‌పై మనసుపారేసుకున్న మాస్టారు.. క్లాస్ రూమ్‌లో లవ్ ప్రపోజల్
Viral: హీరోలాగా ఫీలయిపోయిన ఆ మాస్టారు క్లాస్ రూమ్‌లో అందరు విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చుని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు

Viral: మాస్టారైతే ఏం.. మనసుండదా ఏంటి.. క్లాసులో ఆ విద్యార్థిని చూడగానే నచ్చేసింది.. ఏదో ఒక రోజు తన మనసులో మాట బయటపెట్టాలనుకున్నారు.. పక్కా ప్లాన్ వేసి క్లాస్ రూమ్ అయితేనే బెటర్ అని ఫిక్స్ అయిపోయారు.. కానీ ఉద్యోగం ఊడుతుందని అస్సలు ఊహించలేకపోయారు. హీరోలాగా ఫీలయిపోయిన ఆ మాస్టారు క్లాస్ రూమ్‌లో అందరు విద్యార్థుల ముందు మోకాళ్లపై కూర్చుని ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు అస్సాం దేమాజీ నగర్‌కు చెందిన మనోజ్ కుంబంగ్ అనే వ్యక్తి.
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కేంద్రం (DDU-GKY)లో ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు మనోజ్. అక్కడ శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థినిపై మనోజ్ కన్ను పడింది. ఈ క్రమంలో క్లాస్ రూమ్ లో అందరూ చూస్తుండగానే మోకాళ్లపై కూర్చొని సినిమా స్టైల్ లో విద్యార్థికి ప్రపోజ్ చేశాడు.
అదే సమయంలో కొందరు విద్యార్థులు తమ స్మార్ట్ ఫోన్లలో ఆ దృశ్యాన్ని రికార్డు చేశారు. విద్యార్థులు ఈ వీడియో క్లిప్‌ను తమ స్నేహితులతో పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మాస్టారు మనోజ్‌పై సీరియస్ అయ్యారు. అతడిని, అతడు ప్రపోజ్ చేసిన విద్యార్థినిని కూడా సస్పెండ్ చేశారు.
శిక్షణా కేంద్రంలోని ఒక అధికారి మాట్లాడుతూ, "ఇది ఊహించని సంఘటన. మాకు కొన్ని విషయాలు తెలిశాయి. కానీ అతను ఇలా చేస్తాడని మేము ఊహించలేదు. అతను ఎందుకు అలా చేశాడో మాకు తెలియదు, ఈ సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే, మేము అతన్ని, అమ్మాయిని సస్సెండ్ చేసాము. రికార్డు చేసిన విద్యార్థులపై కూడా చర్యలు తీసుకున్నాం'' అని తెలిపారు.
RELATED STORIES
NCW On Gorantla : గోరంట్ల వీడియోపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్..
11 Aug 2022 4:30 PM GMTSupreme Court : జగన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
11 Aug 2022 9:15 AM GMTAP Tax: ఏపీ ప్రజలకు భారం తెలియకుండా చెత్త పన్ను రాబట్టేందుకు ప్రభుత్వం...
11 Aug 2022 6:15 AM GMTGorantla Madhav: న్యూడ్ వీడియో కాల్‌పై క్లీన్చిట్.. ఫోరెన్సిక్‌కు...
11 Aug 2022 3:43 AM GMTNellore Rottela Panduga: నెల్లూరు బారాషాహిద్ దర్గాలో రొట్టెల పండుగ.....
11 Aug 2022 2:54 AM GMTLokesh : అది ఒరిజినల్ కాకపోవచ్చంటే ఒరిజినల్ ఉందనేగా : లోకేష్
10 Aug 2022 4:30 PM GMT