The Conjuring House: భూత్ బంగ్లాకు రూ.12 కోట్లు.. దాని వెనుక ఓ హాలీవుడ్ కథ..
The Conjuring House: మిగిలిన జోనర్లతో పోలిస్తే హారర్ సినిమాలకు క్రేజ్ చాలా ఎక్కువ. అందులో ఉండే థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలని చాలామందికి ఉంటుంది. అందుకే నిజంగా హారర్ మూమెంట్స్‌ను ఫీల్ అవ్వాలనుకునే వారు కూడా ఉంటారు. అలాంటి ఎక్స్‌పీరియన్స్ కోసం చాలామంది చాలా ఖర్చు చేస్తుంటారు. అలా ఓ వ్యక్తి ఏకంగా రూ.11 కోట్లు పెట్టి భూత్ బంగ్లానే కొనుగోలు చేశాడు. ఆ ఇంటి వెనుక చాలా పెద్ద హాలీవుడ్ కథే ఉంది.
హారర్ సినిమాల్లో ఎన్నో ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా తెరకెక్కాయి. అందులో ఒకటి కంజ్యూరింగ్. ఆ సినిమా నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందే అని చాలామందికి తెలుసు. రోడే ఐలాండ్‌లో ఓ ఫార్మ్‌హౌజ్‌లో ఓ కుటుంబం ఎదుర్కున్న సంఘటనల ద్వారా కంజ్యూరింగ్ సిరీస్ తెరకెక్కుతూ వస్తోంది. అయితే ఆ ఇంట్లో ఉండలేని ఫ్యామిలీ ఎప్పటినుండో దానిని అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంది.
2019లో ఆత్మలపై పరిశోధనలు చేసే ఇద్దరు వ్యక్తులు కంజ్యూరింగ్ ఇంటిని కొనడానికి ముందుకొచ్చారు. కానీ వారు ఆ ఇంట్లో రెండేళ్లు మాత్రమే ఉండగలిగారు. 2021లో మళ్లీ ఆ ఇల్లు అమ్మకానికి వచ్చింది. 1.2 మిలియన్ డాలర్లు ఆస్కింగ్ ప్రైజ్‌గా నిర్ణయించి ఆ ఇంటిని సేల్‌కు పెట్టారు. కానీ అంత డబ్బు పెట్టి ఓ దెయ్యాల కొంపను ఎవరు కొంటారనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ కొద్దిరోజుల్లోనే ఈ ఇల్లు 1.52 మిలియన్ డాలర్లు అంటే రూ.12 కోట్లు పెట్టి అమ్ముడుపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com