Viral Video: లక్కంటే అదీ.. జైల్లో పాడిన పాట బాలీవుడ్ ఆఫర్‌ని తెచ్చిపెట్టింది..

Viral Video: లక్కంటే అదీ.. జైల్లో పాడిన పాట బాలీవుడ్ ఆఫర్‌ని తెచ్చిపెట్టింది..
Viral Video: ఖర్మకాలి పోలీసుల చేతికి చిక్కానని బాధపడ్డాడు.. కానీ అదే తన తల రాతను మారుస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు..

Video Viral: ఖర్మకాలి పోలీసుల చేతికి చిక్కానని బాధపడ్డాడు.. కానీ అదే తన తల రాతను మారుస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు.. డ్రై స్టేట్‌గా ప్రకటించబడిన బీహార్‌లో మద్యం సంబంధిత చట్టాలను ఉల్లంఘించిన కారణంగా కన్హయ్య కుమార్‌ను బక్సూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.



ప్రతిభ ఉంటే అది ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది.. కానీ దానికి కూడా ఓ టైమ్ రావాలి. అప్పటి వరకు వేచి ఉండాల్సిందే.. కన్హయ్య విషయంలో కూడా అదే జరిగింది. అతడికి పాటలు పాడడం ఇష్టం.. జైల్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకని వచ్చిన పాటలేవో పాడుకుంటూ కాలక్షేపం చేశాడు.. కానీ అతడికి తెలియదు.. తాను పాడిన పాటలను జైలు అధికారులు రికార్డు చేశారని.. అంతే కాదు ఆ వీడియో రికార్డుని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు.. దాంతో కన్హయ్య పాట సంగీత ప్రియుల చెవిన పడింది.. బాలీవుడ్ ఆఫర్‌ని సైతం తెచ్చిపెట్టింది.


కన్హయ్య పని నిమిత్తం యూపీకి వెళ్లి అక్కడ హూచ్ తిన్న తర్వాత బీహార్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. బీహార్‌లో చట్టం ప్రకారం, మద్యం తాగిన వారికి రాష్ట్రంలోకి అనుమతి లేదు. దీని కారణంగానే పోలీసులు అతడిని పట్టుకుని జైల్లో పెట్టారు. అక్కడే అతను తాగుబోతు కష్టాలను వివరించే భోజ్‌పురి పాటను పాడుకున్నాడు.



అతను "దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అని పాడుతుండగా, జైలు వెలుపల ఉన్న పోలీసులు కూడా అతని పాటకు పరవశించి పోయారు. అతడి గాత్రాన్ని మెచ్చుకున్నారు. పాటను రికార్డ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.



ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ కావడంతో నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. బాలీవుడ్ గాయకుడు అంకిత్ తివారీ అయితే ఏకంగా అతడికి తన మ్యూజిక్ కంపెనీలో ఒక పాట పాడే అవకాశాన్ని ఇచ్చారు. ఆ వ్యక్తికి పునరావాసం కల్పిస్తామని UP ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.



ఈ పోస్ట్‌ను కూడా అంకిత్ రీట్వీట్ చేశారు. అంతేకాకుండా, యూపీలోని ప్రముఖ స్టూడియోలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి, 3 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది. కన్హయ్య యొక్క అసాధారణ ప్రతిభకు నెటిజన్లు ముగ్ధులవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story