TikTok user @ys.amri: బాబోయ్.. ఇలాంటి ట్విస్ట్ సినిమాల్లో కూడా ఉండదేమో..

TikTok user @ys.amri: ఛీ పాడు.. వినడానికే చెండాలంగా ఉంది.. కొడుకును ప్రేమించి తండ్రిని పెళ్లి చేసుకోవడం. దీన్ని ప్రియుడి కోసం ప్రేయసి చేసిన త్యాగమని ఎలా అంటారు. తనకు భార్య కావలసిన అమ్మాయి తన తండ్రికి భార్య అవడం.. అతడు ఆమె నిర్ణయాన్ని ప్రశంసించడం.. రీల్ లైఫ్‌లో జరిగే విషయాలు రియల్ లైఫ్‌లో కూడా జరుగుతున్నాయని సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
ఓ యువతి ప్రాణంగా ప్రేమించిన బాయ్‌ఫ్రెండ్ తల్లి మరణించడంతో అతడికి తల్లి లేని లోటు తీర్చాలనుకుంది.. తల్లి మరణించడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన బాయ్‌ఫ్రెండ్‌ని ఈ విధంగా ఓదార్చాలనుకుంది. మనకిష్టమైన వాళ్లు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేరు కదా అందుకే ఆ అమ్మాయి ఆ విధంగా చేసింది అని టిక్‌టాక్ యూజర్ అమ్రి ఈ వార్తను షేర్ చేశాడు.
అయితే అతడి నిర్ణయంతో ఏ మాత్రం ఏకీభవించలేదు నెటిజన్స్.. బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకుని అతడి తండ్రిని తన తండ్రిలా భావించి సేవలు చేయవచ్చు కదా.. తండ్రిని పెళ్లి చేసుకోవడం ఏమిటి విడ్డూరం కాకపోతే.. అని తిట్టిపోస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చేసిన త్యాగం ప్రశంసనీయం అని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com