Veera Simha Reddy: బాలకృష్ణ హవా మామూలుగా లేదుగా.. పూజారి చేత కూడా స్టెప్పేయించిన 'జై బాలయ్య'

Veera Simha Reddy: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి విడుదలైంది మొదలు ఎక్కడ చూసినా జై బాలయ్య, జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఆఖరికి గుడిలో నిష్టగా నిత్య దీపారాధన చేసే పూజారి సైతం జై బాలయ్య పాటకి స్టెప్పేస్తున్నారు.. తిరుపతి పూజారి బాలకృష్ణ అభిమాని కావడంతో విడుదలైన మొదటి రోజు పూజాది కార్యక్రమాలు కానిచ్చేసి ఎంచక్కా థియేటర్లో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేశారు.
అంతటితో ఊరుకోకుండా ఆట అయిపోయిన తరువాత బయటకు వచ్చి జై బాలయ్య డ్యాన్స్ చేశారు. దాంతో బాలయ్య అభిమానులకు మరింత ఖుషి. 70 ఏళ్ల వయసున్న పూజారిక్కూడా మా బాలయ్య బాబు నచ్చేశాడు అని తెగ సంబరపడిపోతున్నారు.
పూజారి డ్యాన్స్‌ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు. సినిమా బాలేదనో, యావరేజ్ అనో ఎవరైనా అన్నారో వాళ్లని ఉతికి ఆరేసేలా ఉన్నారు బాలయ్య ఫ్యాన్స్.. అలాగే ఒకరిని గాజు సీసాతో నెత్తి పగలగొట్టడానికి వెళ్లారు. ఎలాగో తప్పించుకున్న అతగాడికి చావు తప్పి కన్ను లొట్ట పోయినంత పనైంది. అది కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com