పాటకి చిన్నారి డాన్స్ అదిరింది.. కానీ కాసేపటికి టీవీ పగిలింది!

చిన్న పిల్లలు ఏదైనా మనం చేసి చూపిస్తే దానిని వెంటనే ఇమిటేట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. ఈ వీడియోలో ఓ చిన్నారి కూడా అదే చేసింది. టీవీలో ప్రభుదేవాకి సంబంధించిన ఓ పాట వస్తుంది. ఆ పాట ఆ చిన్నారికి బాగా నచ్చింది. ఇంకేముంది ఆ పాటలో ఎవరు ఎలాగైతో చేస్తున్నారో అచ్చం అలాగే చేయడానికి ట్రై చేసింది. ఆ చిన్నారి అలా చేస్తుంటే ఆమె తండ్రి తెగ సంబరపడిపోయాడు. దీనిని ఫోన్ లో రికార్డు చేసి ఆనందపడాలని అనుకున్నాడు. అయితే ఆ వీడియో మధ్యలో ఓ బాలనటి డాన్స్ చేస్తూ బస్ ఎక్కుతుంది.
ఆ బస్సులో వేలుడుతూ డాన్స్ చేస్తోంది. అయితే ఇక్కడ ఎగరడానికి ఏం లేకపోవడంతో ఆ చిన్నారి ఏకంగా టీవీనే పట్టుకుని వేలాడింది. ఇంకేముంది చూస్తుండగానే కళ్ళముందే టీవీ మటాష్ అయిపొయింది. అయితే ఇక్కడ ఆ చిన్నారి పైన టీవీ పడలేదు అది సంతోషించదగ్గ విషయం. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిన్నారులు ఉంటే జాగ్రత్త అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.
It only takes a few seconds... pic.twitter.com/90F0D9SHDk
— Kaveri 🇮🇳 (@ikaveri) December 22, 2020
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com