Tollywood : మంచి మనసు చాటుకున్నా... ట్రోలింగ్ తప్పడంలేదు
కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయన్ - విఘ్నేశ్ గతేడాది పెళ్లి చేసుకుని దంపతులుగా మారారు. ఆ తర్వాత సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న ఈ జంట కొత్త సంవత్సరాన్ని మంచి పనితో ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రోడ్డు పక్కన ఉండే పేదలకు తమకు తోచిన సహాయం అందించేందుకు సిద్ధమయ్యారు.
ఫస్ట్ టైం పేరెంట్స్ అయిన నయన్-విఘ్నేష్ దంపతులకు ఈ న్యూ ఇయర్ మరింత స్పెషల్ అనే చెప్పాలి. కొత్త సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేసిన ఈ వీరు, మరో మంచి పనికి పూనుకున్నారు. కొత్త ఏడాది సందర్భంగా ఈ జంట పేదలకు బహుమతులిచ్చి వారిని సర్‌ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
రోడ్డు పక్కన కారు ఆపిన నయన్ దంపతులు అక్కడ ఉండే కొందరు పిల్లలు, మహిళలకు బహుమతులు ఇచ్చారు. సెలబ్రిటీలు నేరుగా తమ దగ్గరకు వచ్చి మరీ బహుమతులిస్తుండటంతో అక్కడున్న వారు సంతోషంతో ఉబ్బితబ్బిబయ్యారు. ఇక ఈ వీడియో చూసిన కొందరు మీరు చేసే మంచి పనికి వీడిమో పెట్టి హంగామా అవసరమా అంటూ విమర్శిస్తుంటే, మరికొందరు నెటిజన్లు మాత్రం తమ గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ అని, ఇందుకే కదా మిమ్మల్ని లేడీ సూపర్ స్టార్ అనేది అంటూ నయన్ మీద ప్రసంసల వర్షం కురిపిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com