Tollywood: సమంత చేతిలో జపమాల.. అందుకేనా..
మయోసైటీస్ బాధపడుతున్న సమంత, రీసెంట్ గా హెల్త్ రికవ్ కోసం పూర్తిగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక తన హెల్త్ ఇష్యూస్ తో సతమతమవుతున్న సామ్ మెడిసన్ తో పాటు ఆధ్యాత్మిక మార్గంలో కూడా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య సమంత జపమాలతో దర్శనమివ్వడం ఈ విషయాన్ని బలపరుస్తోంది.
మెడిసన్ తన ఆరోగ్య పరిస్దితిని నయం చేస్తుందేమో కానీ, తన మానసిక ఒత్తిడులను మాత్రం ఒక్క ఆధ్యాత్మిక చింతన దూరం చేస్తుందన్న కోణంలో సమంత అడుగులు వేస్తోంది.
ఇక తాజాగా 'శాకుంతలం' మూవీ ట్రైలర్ లాంచ్ కు హాజరైన సమంతం తన జపమలను సైతం వెంటబెటుకుని వచ్చింది. దీంతో సామ్ తన పరిస్ధితి బయటకు చెప్పకపోయినా, మానసిక-శారీరక సమస్యలను నుంచి బయటపడడం కోసమే ఆధ్యాత్మిక చింతనలో ఉంటోందని, అందుకే ఎక్కడికెళ్లినా జపమాలను మాత్రం విడిచిపెట్టట్లేదు అని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు తులసి జపమాల ఆరోగ్యం తోపాటు, మనసు ప్రశాంతంగా ఉండటానికి దోహదపడుతుందన్న సంగతి తెలిసిందే. ఏమైనా సమంత త్వరలో కోలుకోవాలని, 'మయోసైటిస్'ను జయించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com