వీధి కుక్క మృతి.. విషాదంలో కాలనీవాసులు!

విశ్వాసానికి పెట్టింది పేరు కుక్క.. చాలా మంది కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు.. వాటిని ఇంట్లో మనుషుల లాగే చూస్తారు. వాటికి క్యూట్ క్యూట్ పేర్లు పెట్టి ముద్దాడుతుంటారు. అవి చనిపోతే తట్టుకోలేరు కూడా.. తాజాగా ఓ వీధి కుక్క రోడ్డు ప్రమాదంలో మృతి చెందితే వీధి వీదంతా విషాదంలో మునిగింది. ఈ ఘటన కేరళలోని పథానంతిట్ట జిల్లా మనక్కాల పట్టణంలో చోటు చేసుకుంది.
రేమణి అనే వీధి కుక్క రోడ్డు ప్రమాదంలో చనిపోగా, ఆ వీధిలోని వ్యాపారులంతా ఆ కుక్క పేరుతో కాలనీలో పోస్టర్లు వేసి నివాళులు అర్పించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలయ్యాయి. దుకాణదారులు, వ్యాపారులు తమ వ్యాపారాలకు రక్షణగా నిలిచిన ఆ కుక్కను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. గతవారం వేగంగా వెళ్తున్న రెండు వాహనాల మధ్య ప్రమాదానికి గురై రేమణి మృతి చెందింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com