Viral News: ట్రెండీ బిచ్చగాడు.. మోపెడ్‌పై మైక్‌తో..
Viral News: బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంగళగిరి అంబేడ్కర్ బొమ్మ కూడలిలో మంగళవారం ఉదయం టీవీఎస్ మోపెడ్‌పై మైక్ ఏర్పాటు చేసుకుని రికార్డు ద్వారా ధర్మం చేయమంటూ యాచిస్తూ కనిపించాడు. చూసిన వారు రోజులు మారాయి.. ధర్మం చేయమని నోటితో అడిగే కాలం చెల్లింది అంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించి మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయి. అదికాస్తా సెప్టిక్ కావడంతో మోకాలి వరకు పుండ్లు పడి నడవలేని పరిస్థితి. దాంతో యాచకవృత్తి చేపట్టినట్లు చెప్పారు. చూసే వారికి వింతగా అనిపించినా తప్పని పరిస్థితి.. దయగల బాబులు ఎవరైనా ధర్మం చేస్తే నాలుగు మెతుకులు నోట్లోకి వెళతాయని ఆశగా చెబుతున్నాడు గోపిరెడ్డి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com