1075 ఏళ్ల జైలు శిక్ష వేశారు.. ఇంతకీ ఏం చేశాడో తెలుసా?

వివాదాస్పద ముస్లిం ప్రబోధకుడు అద్నన్ అక్తర్‌కు టర్కీ కోర్టు కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే కఠిన కారాగార శిక్ష అంటే మనలాగా ఎదో 14 సంవత్సరాలు కాదు.. ఏకంగా 75 సంవత్సరాల జైలు శిక్ష.. మైనర్లపై లైంగిక దాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్మెయిలింగ్ తదితర కేసుల్లో దోషిగా తేల్చిన న్యాయస్థానం అతనికి మొత్తం 1075 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అద్నన్ ఓ ప్రైవేటు టీవీ చానెల్ ద్వారా మతపరమైన బోధనలు చేస్తూ పాపులర్ అయ్యాడు. మహిళల మధ్య కూర్చుని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా తెరపై చర్చలు నిర్వహించేవాడు. వారితో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు కూడా.. ఈ క్రమంలో అతడిపైన ఫోకస్ పెట్టిన టర్కీ.. అతడి ఛానల్స్ పైన నిషేధం విధించింది. పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్ నివాసాలపై దాడులు చేసి 2018లోనే అతడిని అరెస్టు చేశారు. అతని అనుచరలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అయితే విచారణలో పోలీసులకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు తెలిశాయి. నేరాలను, నేరస్థులను ఎంకరేజ్ చేయడం, మైనర్లను లైంగికంగా వేధించడం, అత్యాచారం కేసులు, బ్లాక్మెయిలింగ్ ఇలా అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో అతనిపైన 10 కేసులు నమొదు కావడంతో దోషిగా తేల్చిన న్యాయస్థానం కఠిన కారాగార శిక్షను విధించింది. అతనితో పాటుగా అతని అనుచరులకు కూడా అదే శిక్షను విధించింది న్యాయస్థానం.
అయితే వీటిపైన అద్నన్ మాట్లాడుతూ ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, కుట్రతో చేస్తున్నవని ఖండించాడు. అంతేకాకుండా కోర్టు తీర్పుపై అప్పీలు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అద్నన్ మత ప్రబోధనలతో పాటుగా మంచి రచయిత కూడా..
ఇక తనకి 1000 మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నట్టుగా స్వయంగా అద్నన్ అక్తర్ ఒప్పుకోవడం గమనార్హం.. 'ఆడవాళ్లను చూస్తే నా గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుంది. ప్రేమించడం అనేది మానవ సహజ లక్షణం. నేను అదే చేశాను. నాకు దాదాపు వెయ్యి మంది గర్ల్ఫ్రెండ్స్ ఉన్నారు. వారందరినీ సంతోషపెట్టగల అసాధారణ లైంగిక సామర్థ్యం నాకుంది" అంటూ కామెంట్స్ చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com