Mumbai twin sisters marriage: అక్కచెల్లెళ్లు ఐటీ ఇంజనీర్లు.. అయినా ఒక్కడినే వివాహం

Mumbai twin sisters marriage: ఎవరి ఇష్టం వారిది. అయినా ఎందుకో కొన్ని వింటుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. సాధారణంగా కవల పిల్లలు అన్నీ పంచుకుంటారు. పెద్దయ్యాక భర్తనీ కూడా పంచుకుంటారని ఎవరు మాత్రం ఊహించగలరు.
కానీ ఈ అక్కచెల్లెళ్లు అదే పని చేశారు. మా ఇద్దరికీ ఇద్దరెందుకు ఒక్కరే చాలు అని అతడి చేత మూడు ముళ్లు వేయించుకున్నారు. ఈ వివాహం ఇరుకుటుంబాలకు నచ్చడంతో వారి ఆశీర్వాదంతోనే వివాహ వేడుకలు ముగిశాయి.
ముంబైలో ఐటీ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు ఆ ఇద్దరు కవల సోదరీమణులు. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా మల్షిరాస్‌కు చెందిన వ్యక్తిని శుక్రవారం వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపాయి. కవల సోదరీమణులు పింకీ, రింకీలు ముంబైలో IT ఇంజనీర్లుగా పని చేస్తున్నారు.
ఇద్దరు సోదరీమణులు చిన్నప్పటి నుండి ఒకే ఇంట్లో కలిసి జీవిస్తూ, ఒకరి భావాలు ఒకరు పంచుకుంటూ, ఒకేలా ఆలోచిస్తూ ఉండేవారు. దాంతో ఇద్దరికీ ఒక్కడే నచ్చాడు. తమ కుటుంబానికి అండగా ఉండే అతుల్ అనే వ్యక్తిని ఇష్టపడ్డారు. తండ్రి చనిపోయినప్పుడు, అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు అతుల్ అన్నీ తానై చూసుకున్నాడు. అందుకే అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పింకీ, రింకీలు.
కొందరు పెళ్లిని ప్రశ్నిస్తే, మరికొందరు మీమ్స్ పోస్ట్ చేసి పెళ్లిపై జోక్ చేస్తున్నారు. అయితే, ఇది చట్టబద్ధమా, నైతికమా అని సోషల్ మీడియాలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com