Twitter new Logo: ఎలన్ మస్క్ మరో సంచలనం, ట్విటర్ లోగో స్థానంలో 'X'
Twitter: అందరూ అనుకున్నట్లే ట్విట్టర్ లోగో మారిపోయింది. బ్లూ బర్డ్(నీలి రంగు పక్షి) స్థానంలో X లోగోగా మారుస్తూ కంపెనీ అధినేత ఎలన్ మస్క్ నిర్ణయం ప్రకటించాడు. మస్క్ తన ఫోటో స్థానంలో కొత్త లోగో పెట్టాడు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో కంపెనీ కొత్త పేరు X గా మారింది. ల్యారీ పక్షి స్థానంలో X వచ్చి చేరింది.
నిన్న ఈ నిర్ణయంపై చూఛాయగా సంకేతాలిచ్చిన మస్క్, ఈరోజు అమలు పరిచాడు.ఇక నుంచి X.com అని టైప్ చేస్తే ఆ వెబ్‌సైట్ ట్విట్టర్‌కి రీ డైరెక్ట్ అవనుంది.
ట్విటర్ సంస్థ తన లోగోని చివరగా 2012లో మార్చింది. 2006 నుంచి ఈ పక్షి లోగోని వివిధ రూపాల్లో మార్చారు. 11 సంవత్సరాల తర్వాత దీని స్థానంలో అనూహ్యంగా, కొత్త లోగో X చేరింది.
అయితే మస్క్‌కి X అక్షరంపై మక్కువ ఎక్కువ అని ఎన్నో సందర్భాల్లో వెల్లడైంది. తన ఖగోళ పరిశోధనలు, అంతరిక్ష పర్యాటకం కోసం స్థాపించిన సంస్థకి స్పేస్ ఎక్స్(SpaceX) అని పేరుపెట్టాడు. ఆ అక్షరంపై ఇష్టం 1990ల్లోనే మొదలైంది. 1999లో తను స్థాపించిన పేపాల్‌కి ముందు x.com డొమైన్‌ని ఆవిష్కరించాడు. అయితే 2017లో మస్క్ దానిని పేపాల్‌ని తిరిగి కొనుగోలు చేశాడు. దానిని ట్విట్టర్‌లో మార్పుల కోసం ఉపయోగిస్తూ ఇప్పుడు వాడాడు.
డొమైన్‌ని తిరిగి కొనుగోలు చేసినపుడు పేపాల్ సహవ్యవస్థాపకులు కృతజ్ణతలు తెలుపుతూ, ఆ డొమైన్‌తో తనకు సెంటిమెంట్ ఉందని వెల్లడించాడు. ఎందుకో తెలీదు కానీ, నాకు X అక్షరం అంటే ఎంతో ఇష్టమని వెల్లడించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com