Viral News: బండి మీద బట్టలమ్ముకునే వ్యక్తికి బాడీగార్డులు.. ఏకే 47తో ఎక్కడికి వెళితే అక్కడికి..

Viral News: బండి మీద బట్టలమ్ముకునే వ్యక్తికి బాడీగార్డులు.. ఏకే 47తో ఎక్కడికి వెళితే అక్కడికి..
Viral News: సెలబ్రిటీలు, పొలిటీషియన్లు బయటకు వెళితే వారిని రక్షించడానికి బాడీ గార్డులు ఉంటారు. వారి హోదాను బట్టి బాడీగార్డులను నియమించుకుంటారు.

Viral News: సెలబ్రిటీలు, పొలిటీషియన్లు బయటకు వెళితే వారిని రక్షించడానికి బాడీ గార్డులు ఉంటారు. వారి హోదాను బట్టి బాడీగార్డులను నియమించుకుంటారు. కానీ.. సామాన్యుడికి బాడీ గార్డ్స్ ఉండటం మనం ఎప్పుడూ చూడలేదు. అయితే... ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బండి మీద బట్టలు అమ్మే వ్యక్తికి ఇద్దరు అంగరక్షకులు ఉన్నారు. వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా, ఇద్దరు అంగరక్షకులు ఏకే 47 తుపాకీలతో అతడి వెనక కూర్చున్నారు. బట్టలు కొనడానికి వచ్చిన కస్టమర్లు రామేశ్వర్ అంగరక్షకులను చూసి ఆశ్చర్యపోతున్నారు.

రామేశ్వర్ ఓ చిరు వ్యాపారి. నాలుగు చక్రాల బండిపై పిల్లలు, స్త్రీల దుస్తులు విక్రయిస్తుంటాడు. వివిధ ప్రాంతాలకు నడిచి వెళ్లి వ్యాపారం చేస్తుంటాడు. అతడి సంపాదన రోజుకు 300 నుంచి 500 వరకు ఉంటుంది.

ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తికి ఈ భద్రత ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రామేశ్వర్‌కు భద్రత కల్పించమని కోర్టు ఆదేశించింది. అసలు కోర్టు ఇలా ఎందుకు ఆదేశించిందో తెలుసుకుందాం.

అసలు కథ..

తన భూమికి పట్టా ఇప్పించాలంటూ ఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌ సింగ్‌ సోదరుడు జుగేంద్ర సింగ్‌ను కలిశాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. జుగేంద్ర సింగ్ తనను కులం పేరుతో దూషించాడని రామేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై జుగేంద్ర సింగ్ హైకోర్టుకు వెళ్లాడు.

రామేశ్వర్ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమన్నారు. ఈ కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలో రామేశ్వర్‌ను శనివారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కోర్టుకు వస్తున్న రామేశ్వర్‌ను చూసి జడ్జి ఆశ్చర్యపోయారు. ఓ బాధితుడికి ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను ప్రశ్నించారు. అతడికి భద్రతగా ఇద్దరు అంగరక్షకులను నియమించాలని ఆదేశించారు.

కోర్డు ఆదేశాలతో సీన్ మారిపోయింది. వ్యాపారి రామేశ్వర్ బట్టలు అమ్ముతుండగా, ఇద్దరు అంగరక్షకులు ఏకే 47 తుపాకీలతో అతనికి రక్షణగా ఉన్నారు. బట్టలు కొనడానికి వచ్చిన కస్టమర్లు రామేశ్వర్ బాడీగార్డులను చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరు భయపడి పారిపోతున్నారు. దీంతో వ్యాపారం దెబ్బతిన్నదని, ఇబ్బందులు పడుతున్నామని దయాళ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు రామేశ్వర్ దయాళ్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story