Huzurnagar: ఇలాంటి పంచాయతీ ఎక్కడా చూసుండరు..! పిల్లి కోసం గొడవ.. చివరికి పోలీస్ స్టేషన్ వరకు..

Huzurnagar: పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చెనంట అని సామెత.. అయితే, అలాంటి పిల్లికే ఇప్పుడు పెద్ద కష్టం వచ్చి పడింది.. పిల్లి కోసం పెద్ద పంచాయితీ పెట్టి.. చివరకు దాన్ని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు.. తమాషాగా అనిపిస్తున్నా.. ఒక పిల్లి కోసం రెండు వర్గాలు కొట్టుకు చస్తున్నాయి.. ఈ విచిత్రమైన ఘటన సూర్యాపేట జిల్లా హుజురాబాద్‌లో వెలుగుచూసింది.. ఈ వెరైటీ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు.
హుజూర్‌నగర్‌లో నలుపు, తెలుపు రంగులతో ఓ పిల్లి అందరినీ ఆకర్షిస్తోంది.. ఓ కుటుంబం బెంగళూరు నుంచి దీనిని కొనుక్కొచ్చి పెంచుకుంటోంది..అయితే, ఇది తప్పిపోయి మధురానగర్‌కు చెందిన వారిని దొరికింది.. ఎవరో ఆ పిల్లి జాడను దాని ఓనర్ చెవిలో వేశారు.. అయితే, ఈ పిల్లి కోసం రెండు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి.. పిల్లి మాదంటే మాదంటూ తన్నుకు చస్తున్నారు..
దీంతో ఇరువర్గాలు పిల్లి కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాయి.. ఒకరిద్దరు కాదు.. రెండు వర్గాల నుంచి 50 మంది వరకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.. అంతమంది స్టేషన్‌కు రావడంతో పోలీసులు ఏం జరిగిందో అనుకున్నారు.. చివరకు చూస్తే పిల్లి గొడవ అని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. అయితే, ఇద్దరూ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి రావాలని పోలీసులు చెప్పడంతో చర్చలు జరుపుతున్నాయి..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com