ఈ బుడ్డోడు మాములోడు కాదు..ఫుట్ బాట్ గ్రౌండ్లో తల్లిని..

సోషల్ మీడియాలో చాలా వీడియోలు, ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది. ఓ బుడ్డోడు చేసిన పని హాట్ టాపిక్ అయింది. ఆబుడ్డోడు ఏం చేశాడంటే.. సిన్‌సిన్నాటి, ఓర్లాండో మధ్య ఫుట్ బాట్ మ్యాచ్ జరుగుతుంది. అందరూ సీరియస్ గా మ్యాచ్ చూడడం మొదలు పెట్టారు. అయితే తల్లి మ్యాచ్ చూస్తూ.. పరధ్యానంగా ఉండగా.. ఓ ఓబుడ్డోడు నెమ్మదిగా తల్లి ఒడి నుంచి దిగిపోయి గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఆ పిల్లాడు ఒడిలోంచి జారి గ్రౌండ్ లోకి వచ్చేశాడు. చకాసేపటికి తేరుకున్న ఆమె ఫెన్సింగ్ కింద నుంచి పాకుతూ గ్రౌండ్ వైపు పోతున్న సంగతి గుర్తించింది. వెంటనే ఆమె బారికేడ్ దూకి కొడుకు వెంటే గ్రౌండ్‌లోకి పరుగులు తీసింది.
అప్పటికే ఆ పిల్లాడు మైదానంలోకి వచ్చేశాడు. పరుగులు పెట్టుకుంటూ వెళ్లిన ఆ వెంటనే కొడుకును పట్టుకుంది. పిల్లాడిని పట్టుకుని గ్రౌండ్ నుంచి బయటకు పరుగుపెట్టుకుంటూ వచ్చేసింది. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు అందరూ ఒక్కసారిగా గోల చేశారు. ఈ ఘటనను మేజర్ లీగ్ సాకర్ ట్విటర్ పేజ్ ఆ సరదా వీడియోను పోస్ట్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది.
We hope this mother and her young pitch invader are having a great day. 😂
— Major League Soccer (@MLS) August 9, 2021
pic.twitter.com/hKfwa6wyWI
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com