Viral Video: కారు దిగి కాల్చిన కంకులు కొన్న కేంద్ర మంత్రి.. రేటెంత అన్నందుకు..

Viral Video: కారు దిగి కాల్చిన కంకులు కొన్న కేంద్ర మంత్రి.. రేటెంత అన్నందుకు..
Viral Video: బయట వర్షం.. హైవే రోడ్డుమీద కారులో వెళుతున్న కేంద్ర మంత్రి.. కారు అద్దాల్లోంచి చూస్తే రోడ్డు పక్కన చిన్న టెంటులో కంకులు కాలుస్తున్న ఓ అబ్బాయి. సడెన్‌గా మంత్రి కారుకు బ్రేకులు పడ్డాయి.

Viral Video: బయట వర్షం.. హైవే రోడ్డుమీద కారులో వెళుతున్న కేంద్ర మంత్రి.. కారు అద్దాల్లోంచి చూస్తే రోడ్డు పక్కన చిన్న టెంటులో కంకులు కాలుస్తున్న ఓ అబ్బాయి. సడెన్‌గా మంత్రి కారుకు బ్రేకులు పడ్డాయి.

కేంద్ర ఉక్కు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల సహాయ మంత్రి బీజేపీ నాయకుడు ఫగగన్‌సిగ్ కులస్తే రోడ్డు పక్కన మక్కబుట్టలు బేరమాడుతూ వీడియోకు చిక్కారు. కారు దిగి వచ్చి మూడు కంకులు కాల్పించుకున్నారు. వాటికి శుబ్బరంగా నిమ్మరసం, ఉప్పు, కారం కూడా రాయించుకున్నారు. ఆ తర్వాత బేరమాడ్డం మొదలెట్టారు.

ఒక్కోటి ఎంత అని అడిగారు. దానికి కంకులు కాల్చే కుర్రాడు రూ.15లు అని సమాధానం చెప్పాడు.. దానికి మంత్రి ఆశ్చర్యపోయి అంతా అని అన్నారు.. దాంతో కుర్రాడు మీరు కారులో వచ్చారని అంత రేటు కాదు సార్.. కాల్చిన కంకి స్టాండర్డ్ ధరే అంత అని బదులిచ్చాడు. దీంతో మంత్రిగారు కుర్రాడు అడిగినంత ఇచ్చి కారెక్కారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను కేంద్ర మంత్రి కులస్తే తన ట్విటర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ రోజు సియోని నుంచి మాండ్లాకు వెళ్లున్నాను. స్థానిక మక్కబుట్ట రుచి చూశాను. మనమందరం స్థానిక రైతులు, దుకాణదారుల నుంచి ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలి. ఇది వారికి ఉపాధిని ఇస్తుంది అని క్యాప్షన్ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story