Viral Video: కళ్లముందు కానిస్టేబుల్.. క్షణాల్లో రైలుక్రింద పడి.. వీడియో వైరల్

Viral Video: మృత్యువు ఎలా ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు.. అనారోగ్యంతో వెళ్లి పోయారన్నా అర్థం ఉంటుంది. కానీ హఠాత్తుగా కళ్లముందు ఉన్న మనిషి కన్నుమూస్తుంటే బాధగా ఉంటుంది ఎవరికైనా.
తాజాగా జరిగిన సంఘటన చూస్తున్న వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఉత్తరప్రదేశ్ ఆగ్రా తాజ్ నగరి ప్రాంతంలోని రాజా మండీ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతం కావడంతో ప్రయాణీకుల రద్దీ తక్కువగానే ఉంది. కానిస్టేబుల్ తన డ్యూటీ తాను చేస్తున్నారు. ఫ్లాట్ ఫామ్ పై నిలబడి పరిసరాలను గమనిస్తున్నారు. ఆయనకు దగ్గరలో బెంచీపై మరొక ప్రయాణీకుడు మొబైల్ చూస్తూ కూర్చున్నాడు.
కానిస్టేబుల్ వెనుక నుంచి గూడ్స్ ట్రైన్ వెళుతోంది.. అది గమనించి కానిస్టేబుల్ వెనక్కి తిరిగాడు.. అంతలోనే ఏమైందో కళ్లు తిరిగనట్లు అనిపించాయేమో అలానే రెండు రౌండ్లు తిరిగి ట్రైన్ క్రింద పడి మరణించాడు.
ఆ దృశ్యాన్ని చూసి దూరం నుంచి ఓ వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు కానీ దగ్గరలో ఉన్న వ్యక్తి మాత్రం ఏమీ చేయలేకపోయాడు.. నిదానంగా లేచి అక్కడి నుంచి వెళ్లి పోయాడు. రైలు వెళ్లిన తరువాత కానిస్టేబుల్ శవాన్ని బయటకు తీశారు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతడి బాడీని చూసి కుటుంబసభ్యులు భోరున విలపించారు. ఇదంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
ఏ క్షణంలో ఏ జరుగుతుందో ఎవరూ ఏమీ చెప్పలేరు.. అతడికి మరణం అలా రాసి పెట్టి ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని చూసి నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొబైల్ చూస్తున్న వ్యక్తి ఏ మాత్రం అలెర్ట్ గా ఉన్నా కానిస్టేబుల్ ప్రాణాలు కాపాడేవాడు.. రైల్వే స్టేషన్ల దగ్గర మొబైల్ వాడకాన్ని నిషేధించాలని అని మరొకరు కామెంట్ పెట్టారు.
बहुत दुःखद : आगरा में शनिवार रात 9.31 बजे एक मालगाड़ी जब स्टेशन से गुजर रही थी तब रिंगल कुमार सिंह ट्रेन से कुछ दूरी पर खडे़ थे अचानक 9 बजकर 31 मिनट और 50 सेकेंड पर रिंगल कुमार की तबियत बिगड़ती है और वो अपने स्थान पर खडे़-खडे़ घूमने लगे,मौत हो गई
— aditya TIWARI (@AdityaT35866479) March 27, 2022
राजामंडी रेलवे स्टेशन का मामला💔 pic.twitter.com/GU9YhT8q7W
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com