వైరల్

'Deer Zindagi': జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది: వీడియో వైరల్

'Deer Zindagi': ప్రాణం అమూల్యమైనది, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు.

Deer Zindagi: జీబ్రా క్రాసింగ్ వద్ద జింక.. జీవితం చాలా విలువైంది: వీడియో వైరల్
X

Deer Zindagi: జీబ్రా క్రాసింగ్ వద్ద జింక వీడియోతో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుతున్నారు యూపీ పోలీసులు. పూర్తిగా సృజనాత్మకంగా ఉన్న పోస్ట్‌ను UP పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఈరోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న విపరీతమైన ఆదరణ దృష్ట్యా, పోలీసు శాఖలు కూడా కొన్ని సామాజిక సమస్యలపై పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు, రోడ్డు భద్రత గురించి ప్రజలను హెచ్చరించడానికి UP పోలీసులు ఒక సృజనాత్మక వీడియోను షేర్ చేశారు. దీనికి 'డీర్ జిందగీ' అని ట్యాగ్ చేశారు. ఇది షారుఖ్ ఖాన్, అలియా భట్ నటించిన 'డియర్ జిందగీ' 'సినిమా పేరును గుర్తుకు తెచ్చేలా పేరు పెట్టారు.

యూపీ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జీబ్రా క్రాసింగ్ వద్ద జింక కనిపించింది. రెడ్ సిగ్నల్ పడినప్పుడు, కార్లు ఆగినప్పుడు మాత్రమే ఆ జింక రోడ్డు దాటింది.

"'డీర్ జిందగీ'. ప్రాణం అమూల్యమైనది, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు. ! అని పోస్ట్ చేశారు.

ఆన్‌లైన్‌లో షేర్ చేసిన తర్వాత వీడియో దాదాపు 33 వేల వీక్షణలను పొందింది. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పోలీసు శాఖ ప్రజలను కోరిన విధానాన్ని నెటిజన్లు ప్రశంసించారు.

"జింకలు రోడ్డు భద్రతను అనుసరిస్తాయి. మనం మనుషులం. మనం వాటిని ఎందుకు అనుసరించలేకపోతున్నాం? దయచేసి రోడ్డు భద్రతను అనుసరించండి. ఎల్లప్పుడూ సురక్షితంగా ప్రయాణించండి" అని ఒక వినియోగదారుడు రాశారు.

మరొక వినియోగదారుడు ఇలా రాసుకొచ్చారు. "అడ్మిన్ ఎవరో నాకు తెలియదు, కానీ అతడి సృజనాత్మకత అద్భుతం. ఇలాంటి వీడియోలు మరిన్ని షేర్ చేయండి అని వీడియోని ప్రశంసించారు.

Next Story

RELATED STORIES