UP Police: 'సరుకు దొరుకుతుంది.. పుష్ప కూడా దొరుకుతాడు..' యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
UP Police: 'పుష్ప' సినిమా క్రేజ్ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ పోలీసులు, క్రికెటర్లు, సినీ సెలబ్రిటీలు.. ఇలా అందరూ పుష్ప సినిమాలోని పాటలను, పోస్టర్లను, సీన్లను, డైలాగులను ఉపయోగిస్తున్నవారే. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా పుష్ప క్రేజ్‌ను క్యాష్ చేసుకోనున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ తిరిగే కథే పుష్ప. ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్‌కు రాజే పుష్ప రాజ్. అయితే ఈ ఎర్రచందనం గురించి తెలియని వారు కూడా పుష్ప సినిమా చూసి దాని విలువ ఏంటో తెలుసుకున్నారు. అంతే కాకుండా అనూహ్యంగా ఈ చిత్రం విడుదలయిన తర్వాత నుండే ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా ఎక్కువయ్యింది. అయితే ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తు్న్నవారికి వార్నింగ్ ఇవ్వడం కోసం పుష్ప సినిమాలోని సీన్‌ను ఉపయోగించడం వైరల్‌గా మారింది.
పుష్ప సినిమాలోని తగ్గేదే లే డైలాగు వీడియోను పెట్టి 'పోలీసులు విని ఊరుకుంటారు అనుకుంటున్నారా? యూపీ పోలీసులం మేము' అని ఉత్తరప్రదేశ్ పోలీసులు పట్టుకున్న స్మగ్లర్స్‌ను ఫోటో తీసి.. దీన్నింత ఒక వీడియోగా జతచేసి ట్విటర్‌లో షేర్ చేశారు యూపీ పోలీసులు. అంతే కాకుండా 'సరుకు దొరుకుతుంది.. పుష్ప కూడా దొరుకుతాడు' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా పుష్ప క్రేజ్‌ను ఉపయోగించడం విశేషం అనుకుంటున్నారు నెటిజన్లు.
माल मिलेगा और पुष्पा भी मिलेगा!#PushingPushpaBehindBars #PushpaRaj #Pushpa pic.twitter.com/WfwEZg62zL
— UP POLICE (@Uppolice) February 7, 2022
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com