UP Woman : హ్యాట్సాఫ్ .. చీరతో వేల మందిని కాపాడింది..!

UP Woman :  హ్యాట్సాఫ్ .. చీరతో వేల మందిని కాపాడింది..!
UP Woman : ఆమె పెద్దగా చదువుకోలేదు.. కానీ సమయస్ఫూర్తితో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడింది.. ఆమె చేసిన పనికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు..

UP Woman : ఆమె పెద్దగా చదువుకోలేదు.. కానీ సమయస్ఫూర్తితో కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడింది.. ఆమె చేసిన పనికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఎటా జిల్లా అవగాడ్‌ మండలం గులేరియా వాసికి చెందిన ఓంవతీ దేవి అనే ఓ మహిళా ఎప్పటిలాగే తన పొలం పనులకి వెళ్తుంది.

అయితే కుస్బారైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు విరిగి ఉండడాన్ని ఆమె గమనించింది.. ఈ విషయాన్ని రైల్వే అధికారులకి చెప్పే టైం లేదు.. అప్పుడే ట్రైన్ వస్తున్న కూత ఆమెకి వినబడింది.. వెంటనే ఆమె తన సమయస్ఫూర్తితో విరిగిన రైలు పట్టాలకి కొంచం ముందుకు వెళ్లి ఆ పట్టాలకి ఇరువైపులా రెండు కట్టెలు పాతి వాటికి తాను కట్టుకున్న చీరను విప్పేసి కట్టింది.

పట్టాలకు ఎదురుగా ఎరుపు రంగు చూసి ట్రైన్ ఆపుతారని ఆమె ఆలోచన అన్నమాట.. మొత్తానికి ఆమె ఆలోచన వర్కౌట్ అయింది. రైలు ఆగింది.. ఆ తర్వాత ఆమెను ఏమైందని అడిగి తెలుసుకున్నాడు.. ఆ తర్వాత ఆమె చీరను ఆమెకి ఇచ్చేసి అధికారులకి జరిగిన విషయాన్ని వెల్లడించాడు. సుమారు గంట తర్వాత మళ్ళీ ట్రైన్ ముందుకు కదిలింది.

ఆమె చేసిన ఈ సాహసానికి అభినందనలు మాత్రమే కాకుండా కొంత నగదును కూడా అందజేశారు అధికారులు.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు కూడా ఆమెను అభినందిస్తున్నారు.

Read MoreRead Less
Next Story