Urvashi Radadiya: ఆమె గొంతు విప్పింది.. నోట్ల వర్షం కురిసింది..
Urvashi Radadiya (tv5news.in)
Urvashi Radadiya: అభిమానులు అంటే వారి ప్రతీ ధ్యాసలో తమ ఫేవరెట్ స్టార్ల కోసం ఏమేమి చేస్తుంటారో కొన్నిసార్లు ఊహకు కూడా అందవు. అందుకేనేమో అభిమానుల అభిమానానికి అంతే ఉండదు అంటుంటారు. ఇప్పటివరకు మనం చూసిన ఫ్యాన్స్ ఒక ఎత్తు అయితే.. ఈ సింగర్‌కు ఉన్న ఫ్యాన్స్ మరో ఎత్తు. ఇప్పటివరకు తమ అభిమాన నటీనటులకు పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం చూసుంటాం.. కానీ ఈ సింగర్‌కు ఏకంగా తన అభిమానులు నోట్లతో అభిషేకం చేశారు.
ఊర్వశి రదాడియా.. ఒక గుజరాతి ఫోక్ సింగర్. తాను ఇటీవల ఓ కాన్సర్ట్‌ను నిర్వహించింది. అందులో తన అభిమానులు ఊర్వశి గాత్రానికి ఉప్పొంగిపోయి.. ఒక్కసారిగా తనపై నోట్ల వర్షాన్ని కురిపించారు. అంతే కాదు.. ఒక అభిమాని ఏకంగా తనకోసం ఒక బకెట్ నిండా డబ్బులు తెచ్చి తనపై పోశాడు. ఈ అభిమానానికి ఊర్వశి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
తన అభమానులు తనపై కురిపించిన ఈ నోట్ల వర్షాన్ని వీడియో తీసి ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "మీ అమూల్యమైన ప్రేమకు ధన్యవాదాలు" అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోవడమే కాదు.. దీనిని తెగ వైరల్ చేస్తున్నారు కూడా. దీని వల్ల సోషల్ మీడియాలో ఊర్వశి తనకు తానే క్వీన్ ఆఫ్ గుజరాతి అనే బిరుదును కూడా ఇచ్చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com