Urvashi Rautela : నటిని బిచ్చగత్తెతో పోల్చుతూ నెటిజన్ల ట్రోలింగ్.. !
సెలబ్రిటీలు అంటే అందరికంటే భిన్నంగా ఉండేందుకు ట్రై చేస్తుంటారు. కొన్ని సార్లు ఇవి సక్సెస్ అయితే మరికొన్ని సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. తాజాగా డిఫరెంట్ డ్రెస్సింగ్‌తో విభిన్నంగా అందరిని ఆకట్టుకోవాలని ప్రయత్నించి అభాసుపాలైంది బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం ఆమెను సోషల్ మీడియాలో నెటిజన్లు ఫుల్ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆమె డెనిమ్ జాకెట్ ధరించి ఉండగా, ఆమె వేసుకున్న జీన్స్ ముందు, వెనకాల చిరిగినట్లుగా ఉంది. దీనితో సోషల్ మీడియాలో ఆమె పైన జోకులు, పంచులు పేలుతున్నాయి. 'అమ్మ బాబోయ్, ఇది డ్రెస్సా?' అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండగా, మరికొందరు మరీ దారుణంగా ఆమెను బిచ్చగత్తెతో పోలుస్తున్నారు. కానీ కొందరు ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ని సమర్ధిస్తున్నారు. 'తను ఎలాంటి బట్టలు వేసుకుంటే మీకేంటి?' అంటూ కామెంట్స్ వదులుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com