Uttar Pradesh: వధువు కోపం.. వరుడి చెంపలు ఛెళ్లు.. వీడియో వైరల్
Uttar Pradesh: అమ్మాయిలంటే అంత చిన్న చూపా.. తాగొచ్చినా తలొంచుకొని తాళి కట్టించుకుంటుందనుకున్నావా.. అని చెప్పకనే చెప్పింది ఈ సంఘటన. మెడలో దండ వేయబోయిన వధువుని చెంప మీద పెట్టి కొట్టింది వధువు.. ఒక్కసారి కాదు.. రెండు మూడు సార్లు చెంప ఛెళ్లుమనిపించి వడివడిగా నడుచుకుంటూ వెళ్లింది. విషయం అర్థం కాక పెళ్లికి వచ్చిన అతిధులు అలాగే చూస్తుండిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లోని వరమాల వేడుకలో వధువు వరుడిని చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడిని రవికాంత్‌గా గుర్తించారు. వధువు వరుడిని చెంపదెబ్బ కొట్టడానికి అసలు కారణం తెలియకపోగా, వరుడు మద్యం మత్తులో పెళ్లి వేదిక వద్దకు వచ్చారని, ఇది అమ్మాయికి కోపం తెప్పించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
వధువు వరుడిని చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వధువు కుటుంబీకులు వివాహాన్ని అత్యంత వైభవంగా జరపాలనుకున్నారు. కానీ ఈ అవాంఛనీయ సంఘటన వివాహ వేడుకలను స్తంభింపజేసింది. కుటుంబసభ్యులంతా కలిసి వధువుకు సర్ధిచెప్పి వివాహతంతు ముగించారు. మరి పెళ్లైన తరువాత అయినా సక్కగ లేకపోతే భర్తని ఉతికి ఆరేస్తుందేమో అంటున్నారు వీడియో చూసిన నెటిజన్లు. మార్పు మంచిదే.. మందుబాబులకు ఈ విధంగానే బుద్ది చెప్పాలి అని అంటున్నారు మరికొంతమంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com