Viral Video : రన్నింగ్‌లో ఉన్న ట్రక్‌పైనే పుషప్‌లు కొట్టాడు..
By - Divya Reddy |17 July 2022 3:11 PM GMT
Viral Video : నడుస్తున్న ట్రక్కు పైనే పుషప్‌లు కొట్టాడు.
Viral Video : నడుస్తున్న ట్రక్కు పైనే పుషప్‌లు కొట్టాడు. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ ట్రక్కు చెత్తను మోసుకెళ్తుంది. ఆ ట్రక్ సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. దాని పైనే షర్టు లేకుండా ఉన్న ఓ వ్యక్తి అలాగే పుషప్‌లు కొట్టాడు. కొన్ని సెకండ్ల తరువాత లేచి నిలబడ్డాడు. కానీ అంతలోనే బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు.
ఈ ఘటన మొత్తం వీడియోలో రికార్డ్ అయింది. దీన్ని లక్నో అడిషనల్ డీసీపీ స్వేత శ్రీవాస్తవ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. శక్తిమాన్‌లు కాదు బుద్ధిమంతులు కండి అని ఆ అధికారి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com