Shocking Video: ఫ్రెండ్ బర్త్‌డేలో ఆట.. పాట.. అంతలోనే ఆగిన గుండె

Shocking Video: చెట్టుకి ఆకులు కూడా పండిన తరువాతే రాలుతాయి. కానీ మనిషి మాత్రం వయసుతో పనిలేకుండా రాలిపోతున్నాడు.. అయిన వాళ్లందరికి కన్నీళ్లు మిగిల్చి మధ్యలోనే జీవితాన్ని ముగించేస్తున్నాడు. జీవితం నీటి బుడగలాగా మారిపోయింది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. మరణం నీడలా వెన్నంటే ఉంటుందంటే ఇదేనేమో. సడెన్ స్ట్రోక్‌లు ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువయ్యాయి. ఒత్తిడితో కూడిన జీవనశైలే దానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అర్థరాత్రి మందు పార్టీలు, మటన్ బిర్యానీలు. గుండె మీద ఒత్తిడి. పని చేయనని మొరాయించేస్తుంది. సడెన్‌గా ఆగిపోతుంది.
ఉత్తర ప్రదేశ్ బరేలీకి చెందిన 45 ఏళ్లున్న ప్రభాత్ ప్రేమీ.. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ల్యాబ్ టెక్నీషియన్. గురువారం రాత్రి ఆయన తన స్నేహితుడు మనీష్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఓ హోటల్‌లో ఫ్రెండ్స్ అందరికీ ట్రీట్ ఇచ్చాడు మనీష్. వేడుకల్లో భాగంగా ప్రభాత్ బాలీవుడ్ సాంగ్‌కి స్టెప్పులేయడం మొదలెట్టారు. ఆయన డ్యాన్స్ చూస్తున్న స్నేహితులు అతడిని ఎంకరేజ్ చేస్తూ విజల్స్ వేస్తూ గోల చేశారు. డ్యాన్స్ చేస్తూనే ప్రభాత్ కిందపడిపోయారు. అనుకోని ఈ పరిణామానికి హతాశులైన స్నేహితులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com