తాబేలు ఏంటి ఇలా మారిపోయింది.. పాక్కుంటూ పక్షి పిల్లని.. వీడియో వైరల్

తాబేలు ఏంటి ఇలా మారిపోయింది.. పాక్కుంటూ పక్షి పిల్లని.. వీడియో వైరల్

కొన్ని జంతువులు శాఖాహారులు.. వాటిని మనుషులు పెంచుకుంటే తప్ప మాంసాహారులుగా మారవు. అలాంటిది అడవిలో స్వేచ్ఛగా తిరిగే తాబేలు పాకుతూ పక్షి పిల్లను నోట కరిచింది. పాపం ప్రాణం ఆ బుజ్జి పిల్లని గుటకాయ స్వాహా చేసింది. సాధారణంగా తాబేళ్లు శాఖాహార జంతువులు. ఆకులు, అలములు తప్ప మరేవీ తినవు. మనుషులు మారిపోయినట్టే జంతువులు తమ రూటు మార్చేస్తున్నాయేమో.

తాబేలంటే మనకో అభిప్రాయం. నిదానంగా ఉంటుంది. సాధు స్వభావంగల జీవి అని. కానీ తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్‌లో మూడు వేలకు పైగా తాబేళ్లున్నాయి. ఓ భారీ ఆడ తాబేలు తన ముందే ఎగురుతున్న ఓ చిన్న పక్షిపిల్లపై కన్నేసింది. చిరుతలా దాన్ని వదిలేది లేదన్నట్లు వెంబడించింది. పాపం పక్షిపిల్ల కూడా ఎగరలేకపోయింది. దాని దాడికి దాసోహమై ప్రాణాలు వదిలింది. ఇక ఆ జీవిని నోటకరిచి శుభ్రంగా తినేసింది. ఇది చాలా అరుదైన సంఘటన అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ఫ్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెబెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలా ప్రవర్తించి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ కరెంట్ బయాలజీ జర్నల్‌లో ఓ కథనం రాశారు.

కరోనా ప్రభావం..

తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. పక్షి గూడు నుంచి పడిపోయిన గుడ్లను, పిల్లలను తాబేళ్లు తింటున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ దానిపై సరియైన పరిశోధనలు జరపలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూశాక అది నిజమే అని నమ్మాల్సి వస్తుందంటున్నారు జూ అధికారులు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల అవి అలా తయారై ఉంటాయని భావిస్తున్నారు. అయితే అవి వాటి జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎంత కాలం మనుగడ సాగించగలవు అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాబేళ్ల ప్రస్తుత పరిస్థితిపై దృష్టి సారించి మరిన్ని పరిశోధనలకు సిద్ధపడుతున్నారు ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్.

Tags

Read MoreRead Less
Next Story