ఇదేం పోయేం కాలం.. తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి.. ఛీ..ఛీ!

పెళ్లి భోజనం అంటే అందరికీ చాలా రకాల వంటలు గుర్తుకు వస్తాయి. అదే వెజ్ అయినా నాన్‌వెజ్ అయినా సరే.. ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనమంటే కాస్తా భయపడిపోతారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లి వేడుక చాలా ఘనంగా జరుగుతుంది. చాలా మంది అతిధిలు అక్కడికి వచ్చారు. పెళ్ళికి వచ్చిన అతిధిల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. అయితే అక్కడ ఎవరు లేరనుకున్నాడో ఏమో కానీ.. తయారుచేస్తున్న రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు.
అలా అని ఒక్కదానితో వదలకుండా చేసే ప్రతి ఒక్క రోటీ మీద కూడా ఇలాగే ఉమ్మాడు. అయితే ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది కాస్తా మీరట్ పోలీసులు దృష్టికి వెళ్ళడంతో వారు దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇలా చేసిన వ్యక్తిని సోహైల్‌గా గుర్తించారు. కాగా ఈ వైరల్ వీడియో పైన నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తున్నారు.
इसके हाथों की रोटी कौन-कौन खाना चाहेगा pic.twitter.com/x8GFXbrlUy
— @tweetBYपत्रकार (@kumarayush084) February 19, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com