Viral Video: 5వ ఫ్లోర్ నుండి జారిపడిన చిన్నారి.. కాపాడిన రియల్ హీరో..

Viral Video: ప్రమాదం అనేది చెప్పి రాదు. కానీ అలాంటి ప్రమాదాలు వచ్చినప్పుడు వెంటవెంటనే దానికి స్పందించేవారే రియల్ హీరోస్. అలాంటి రియల్ హీరోస్ మన చుట్టూ చాలామందే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే వారేమి చేయగలరో మనకు అర్థమవుతుంది. ఇటీవల చైనాలో అలాంటి రియల్ హీరో చేసిన ఓ సాహసమే ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడింది.
చైనాలోని టాంగ్జియాంగ్ ప్రాంతంలో ఓ రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్ నుండి జారిపడింది. అక్కడే ఉండి దానిని గమనించిన ఓ వ్యక్తి.. మరో యువతి సాయంతో తనను కాపాడాడు. చిన్నారి కింద పడకుండా చేతులతో పట్టుకున్నాడు. దీంతో చిన్నారి.. చిన్న గాయం కూడా లేకుండా బయటపడగలిగింది.
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆ యువకుడు చేసిన పనికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నాడు. 'మన మధ్య ఉండే హీరోలు వీళ్లే' అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం అంతటా వైరల్‌గా మారింది.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com