వైరల్

Elephant Viral Video: పిల్ల ఏనుగు మృతదేహంతో తల్లి.. హృదయాన్ని కదిలించే వీడియో..

Elephant Viral Video: ఆ ఏనుగు గురించి సమాచారం అందుకున్న అధికారులు ఏనుగు పట్టుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Elephant Viral Video: పిల్ల ఏనుగు మృతదేహంతో తల్లి.. హృదయాన్ని కదిలించే వీడియో..
X

Elephant Viral Video: జీవించే విధానాలు వేరైనా.. తల్లి ప్రేమ ఎప్పుడైనా ఒకటే.. మనుషులకే కాదు.. జంతువులకు కూడా తల్లి ప్రేమ ఒకటే. కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్టుగా ఎవరి బిడ్డ వారికి ముద్దు. అలాంటి తల్లి కళ్ల ముందే బిడ్డ మరణిస్తే.. తల్లి తట్టుకోగలదా.. బిడ్డ శవాన్ని చూసిన తల్లి మనసు కుదుటపడగలదా.. కష్టమే. అలాగే ఓ తల్లి ఏనుగు తన బిడ్డపై చూపిస్తున్న ప్రేమ ఎన్నో హృదయాలను కదిలిస్తోంది.

బెంగాల్‌ జలపైగురిలో ఓ గున్న ఏనుగు మరణించింది. మరణానికి కారణాలు ఏంటో తెలియదు. కానీ తల్లి ఏనుగు మాత్రం తన బిడ్డను అలా విడిచిపెట్టాలి అనుకోలేదు. అందుకే ఆ శవాన్ని తన దంతాలతో పట్టుకొని చాలాదూరం మోసుకెళ్లింది. అలా మోయడం దానికి ఇబ్బందిగా అనిపించినా.. బిడ్డ శవాన్ని వదిలివెళ్లడం ఇష్టం లేక చాలాదూరం అలాగే నడిచింది.

ఆ ఏనుగు గురించి సమాచారం అందుకున్న అధికారులు ఏనుగు పట్టుకోవడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. గున్న ఏనుగు శవంతో ఆ తల్లి ఏనుగు ఎంత దూరం ప్రయాణించిందో తెలియదు. కానీ అధికారులు మాత్రం దానిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీ ఎస్టేట్‌ల మధ్యలో నుండి ఆ ఏనుగు శవాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు స్థానికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES