video viral: బామ్మకు హ్యాట్సాఫ్.. 70 ఏళ్ల వయసులో ఈత..

Video Viral: వయసు శరీరానికే కానీ మనసుకి కాదని ముందడుగు వేసింది 70ఏళ్ల బామ్మ. ఉధృతంగా ప్రవహిస్తున్న గంగా నదిలో ఈత కొట్టి రికార్డు సృష్టించింది. హరిద్వార్ వంతెన వద్ద 70 ఏళ్ల వృద్ధురాలు చేసిన విన్యాసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవిత్ర గంగా నదిలో భక్తులు స్నానమాచరిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఉత్తర ప్రదేశ్‌లోని హరిద్వార్‌కు ప్రార్థనలు చేయడానికి, నదిలో స్నానం చేయడానికి వస్తారు. అయితే ఒక భక్తురాలు వంతెనపై నుండి వేగంగా ప్రవహించే నదిలోకి దూకి విజయవంతంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. ఆమె తన అద్భుతమైన స్విమ్మింగ్ స్కిల్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఈ వీడియోను ఛత్తీస్‌గఢ్ సుప్రీంకోర్టు అదనపు అడ్వకేట్ జనరల్ అశోక్ బసోయా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
వీడియోలో, వృద్ధ మహిళ వంతెనపై నుండి ఆత్మ విశ్వాసంతో దూకడం కనిసిస్తుంది. ఇతర భక్తులు దిగువ నదిలో స్నానం చేస్తుంటారు. ఈ వీడియో నెటిజన్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకరు "వావ్" అని రాస్తే, మరొకరు, "ఇది నమ్మశక్యం కానిది." అని రాశారు. అయితే ఈ స్టంట్ ప్రమాదకరమని, వృద్ధురాలు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం పేర్కొంది.
हौसले को सलाम है माता। https://t.co/erDhhCWBxf
— Binod Keshri (@bkeshria) June 28, 2022
दादी जी जरा संभल के... ये कहना इनके लिए ठीक नहीं होगा। दिल तो बच्चा है जी। .......... #ViralVideo https://t.co/EC5efVG5uo
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com