Video Viral: మృత్యువు వెన్నంటే.. డ్యాన్స్ చేస్తూ వేదికపైనే కుప్పకూలి..

Video Viral: మృత్యువు వెన్నంటే.. డ్యాన్స్ చేస్తూ వేదికపైనే కుప్పకూలి..
Video Viral: ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మన మధ్యే ఉంటారు. అంతలోనే అర్థాంతరంగా తనువు చాలిస్తారు.

Video Viral: ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు మన మధ్యే ఉంటారు. అంతలోనే అర్థాంతరంగా తనువు చాలిస్తారు. జమ్ముకశ్మీర్‌లో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీసీ కెమెరాల పుణ్యమా అని ఇలాంటి సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి.

జమ్ము కశ్మీర్‌కు చెందిన ఓ కళాకారుడు గణేశ్ ఉత్సవాల్లో భాగంగా పార్వతీ వేషం ధరించి వేదికపై డ్యాన్స్ చేస్తున్నారు. హావ భావాలు ప్రదర్శిస్తూ తన్మయత్వంతో అతడు చేస్తున్న డ్యాన్స్‌కు ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. కానీ అంతలోనే కుప్పకూలిపోయారు.. అది కూడా డ్యాన్స్‌లో భాగమే అనుకున్నారు ఆడియన్స్. కానీ ఎంతకూ పైకి లేవకపోవడంతో శివుడు పాత్రధారికి అనుమానం వచ్చి అతడి వద్దకు వచ్చి లేపే ప్రయత్నం చేశారు.

కానీ అతడిలో చలనం లేదు. దాంతో ఈవెంట్ మేనేజర్లు హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం నమోదవుతున్నాయి. జూన్‌లో, KK అని పిలవబడే గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ కోల్‌కతాలో తన సంగీత కచేరీ తర్వాత గుండెపోటుతో మరణించాడు.

రిహార్సల్స్ సమయంలో అతను "అసౌకర్యం" గురించి ఫిర్యాదు చేసినట్లు వీడియోలు చూపించాయి. కెకె మరణానికి కొన్ని రోజుల ముందు మే 28న కేరళలోని అలప్పుళలో జరిగిన సంగీత కచేరీలో ప్రముఖ మలయాళ గాయకుడు ఎడవ బషీర్ కూడా వేదికపై కుప్పకూలి మరణించారు.

Tags

Next Story