Video Viral: మాట్లాడుతూనే కుర్చీలో వెనక్కివాలిపోయిన రోగి.. డాక్టర్ వెంటనే CPR ఇవ్వడంతో..

Video Viral: మాట్లాడుతూనే కుర్చీలో వెనక్కివాలిపోయిన రోగి.. డాక్టర్ వెంటనే CPR ఇవ్వడంతో..
Video Viral: తన ఎదురుగా కూర్చున్న పేషంట్‌తో మాట్లాడుతూనే ఉన్నారు డాకర్ట్.. ఇంతలోనే పేషెంట్ కుర్చీలోనే ఒరిగిపోయాడు.

Video Viral: తన ఎదురుగా కూర్చున్న పేషంట్‌తో మాట్లాడుతూనే ఉన్నారు డాకర్ట్.. ఇంతలోనే పేషెంట్ కుర్చీలోనే ఒరిగిపోయాడు. తక్షణం స్సందించిన డాక్టర్ CPR ఇవ్వడం ద్వారా ప్రాణాలను కాపాడారు. డాక్టర్ సమయస్ఫూర్తికి పలువురు ట్విట్టర్ వినియోగదారులు అతనికి ధన్యవాదాలు తెలిపారు.

ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో వివరణ ప్రకారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 37 సెకన్ల క్లిప్‌లో, నీలిరంగు టీ-షర్టు ధరించిన వ్యక్తి డాక్టర్‌తో సంభాషిస్తున్నట్లు కనిపించాడు. అతను అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం ప్రారంభించాడు. అప్రమత్తమైన డాక్టర్ వెంటనే అతడి గుండెను టాప్ చేయడం ద్వారా ఆయన ప్రాణాలను కాపాడారు.

కొల్హాపూర్‌కు చెందిన ఉత్తమ కార్డియాలజిస్టులలో ఒకరైన డాక్టర్ అర్జున్ అడ్నాయక్ ఒక రోగిని రక్షించారు. డాక్టర్ అడ్నాయక్ రోగి ఛాతీ పైన కొట్టడం ద్వారా అతనికి కార్డియోపల్మోనరీ రెసిటేషన్ (CPR) ఇస్తున్నట్లు వీడియో చూపిస్తుంది.

కొన్ని స్ట్రోక్‌ల తర్వాత, అతడు స్పృహలోకి వస్తాడు. వెనక్కి వాల్చేసిన తల తిరిగి స్థిరంగా ఉంటుంది. ఇప్పటికే ఈ వీడియోని 38,000 కంటే ఎక్కువ మంది చూశారు. అనేక మంది ట్విట్టర్ వినియోగదారులు అతనికి కృతజ్ఞతలు తెలిపారు.

"జీవితాన్ని కాపాడడానికి కొన్ని సెకన్లు" చాలు.. అని ఒక వినియోగదారుడు వ్యాఖ్యానించారు. హార్ట్ ఎటాక్ సైలెంట్ కిల్లర్.. డాక్టర్‌కి హ్యాట్సాఫ్" అన్నాడు మరొకరు వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story