Video Viral: తన పిల్లల్ని పట్టుకుంటున్నాడని మనిషిని పరిగెట్టించిన బాతు

Video Viral: దారినపోతూ ముద్దుగా ఉన్న బాతు పిల్లల గుంపు కనిపిస్తే దగ్గరకు వెళ్లాడు. ముట్టుకుందామనే లోపు తల్లి వచ్చింది. దాని ఆవేశం చూసి ఏం చేస్తుందో అని కంగారు పడిపోయి పరిగెట్టాడు అతడు.. ఎంత వేగంగా పరిగెట్టినా.. నీ అంతు చూస్తా అన్నట్టు వెంబడించింది బాతు.
చూసే వారికి ఇది నిజమేనా అనిపించేలా ఉంది. మనుషులకే కాదు జంతువులకు, పక్షులకు కూడా పిల్లలంటే ఎంతో ప్రేను. ఈ వీడియోలోని ఊహించని సన్నివేశం చూసి నెటిజన్లు ఆశ్యర్యానికి గురవుతున్నారు. ఇది ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారి నవ్వు తెప్పిస్తోంది.
ఓ చిన్న పక్షి ఆరడుగుల మనిషికి కూడా అదురు పుట్టించింది. తల్లి తన పిల్లలకు చిన్నపాటి ముప్పు ఎదురైనా ఎంత దూకుడుగా వ్యవహరిస్తుందో చూపించింది ఈ వీడియో.
సాధారణంగా జంతు ప్రేమికులకు ఈ ఆశ్చర్యకరమైన చిత్రాలు అపురూపంగా అనిపిస్తాయి. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, పెద్దబాతులు సాధారణంగా పొలాల్లో గడ్డి, సెడ్జెస్, ధాన్యాలు, బెర్రీలు తింటాయి. వాటి దృఢమైన ముక్కు కారణంగా గడ్డి కాడలను అవలీలగా తినేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com