Viral: కవలలే... కానీ, పుట్టిన రోజులు మాత్రం వేరు....
మామూలుగా కవలలు కొన్ని నిమిషాలలోనో లేక కొద్ది సమయం తేడాతోనో పుడుతుంటారు. కానీ అమెరికాకి చెందిన ఓ మహిళ కేవలం 6 నిమిషాల తేడాతో ఏకంగా సంవత్సరాలను సైతం మార్చేలా ఇద్దరు కవలలను జన్మనిచ్చింది. అందేంటీ అని ఆలోచిస్తున్నారా? ఆ కథ మీకోసం
టెక్సాస్ కు చెందిన 37 ఏళ్ల జో స్కాట్ పురుటి నెప్పులతో డిసెంబర్ 31న ఆసుపత్రిలో చేరింది. అదే రోజు రాత్రి 11.55 గంటలకు ఓ ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే 12.గంటలా 01 నిమిషం తేడాతో మరో బాలికకు జన్మించింది. దీంతో మొదటి బిడ్డ 2022 డిసెంబర్ 31న పుట్టగా, రెండోవ శిశువు 2023జనవరి 1న జన్మించినట్లు అయ్యింది.
ఇలా రెండు వేర్వేరు సంవత్సరాల్లో స్కాట్ కు కవలలు జన్మించారు. దీంతో తమ ఇద్దరు పిల్లల పుట్టినరోజులు వేరు వేరుగా జరుపుతామని స్కాట్ తెలిపింది. ముందు పుట్టిన బిడ్డకు డిసెంబర్ 31న పుట్టినరోజు జరుపుతామని, అనంతరం కొత్త సంవత్సరం రోజున అంటే జనవరి 1న రెండో బిడ్డకు పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తామని ఇరువురు భార్యభర్తలు వెల్లడించారు.
మరోవైపు ఈ విషయం తెలిసినవారు చిన్నారుల ఫొటోలను సోషల్‌మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఒకే తల్లికి పుట్టిన కవలలు, కానీ బర్త్ డే టైమింగ్స్ వేరు, సంవత్సరాలు వేరూ అంటూ, క్రేజీగా కామెంట్స్ పెడుతున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com