Viral: నిద్రిస్తున్న కొడుకుతో రీల్.. నెటిజన్ల ఫైర్

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి పోస్ట్ చేయడం చాలా మందికి వ్యసనమైపోయింది. పసి పిల్లల నుంచి మొదలు పండు ముసలి వరకు రీల్స్ పై రోజు రోజుకూ పిచ్చి పెరిగి పోతుంది. వాటిని షేర్ చేసి లైకుల కోసం, వ్యూస్ కోసం తెగ ఆరాట పడిపోతుంటారు. కొందరైతే రీల్స్ తీయడమే ధ్యేయంగా వాటిని చిత్రీకరించేందుకు ఎంతకైనా తెగించేస్తున్నారు.
అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అయింది. తల్లిదండ్రులు చేసిన వింత నిర్వాకం వారిని తీవ్ర విమర్శల పాలు చేసింది. తమ కుమారుడు గాఢ నిద్రలో ఉన్న గదిలో గంగ్నమ్ స్టైల్ పాటకు డాన్స్ చేస్తూ అతని వద్దకు వెళ్లి బెడ్‌షీట్‌ను తీసి అమాంతం లేపి నిల్చో బెట్టడానికి ప్రయత్నిస్తారు. నిద్ర మత్తులో ఉన్న కుర్రాడు ఏమైందో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది. కాస్త నిద్ర మత్తు ఒదిలాక అమ్మనాన్నలతో కలిసి నిద్ర మత్తులోనే స్టెప్పులేశాడు.
ఆ వీడియోకు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అది చూసిన వారంతా నిద్రిస్తున్న చిన్న పిల్లాడిని రీల్ చేయడం కోసం అమాంతం లేపేస్తారా అంటూ కాంమెంట్స్ చేస్తున్నారు. నిద్రిస్తున్నవారిని అలా లేపడం సరికాదని, వారి ప్రవర్తన పట్ల నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com