Viral News: బంగారు గాలి పటం.. ధర వింటే షాకే..

Viral News: బంగారు గాలి పటం.. ధర వింటే షాకే..
Viral News: జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టుకుంటుంది.. అలాగే డబ్బు బాగా ఉంటే ఏమైనా చేయొచ్చు.. కార్లు, గాలి పటాలు మరెన్నో ఖరీదైన వస్తువులు కొనుక్కొని ముచ్చటపడొచ్చు.

Viral News: జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెట్టుకుంటుంది.. అలాగే డబ్బు బాగా ఉంటే ఏమైనా చేయొచ్చు.. కార్లు, గాలి పటాలు మరెన్నో ఖరీదైన వస్తువులు కొనుక్కొని ముచ్చటపడొచ్చు. బంగారు గాలిపటం తయారు చేయాలన్న ఐడియా ఎవరిది బాబూ.. అవును ఇంతకీ ఇది గాల్లో ఎగరుతుందా.. ఎవరూ ఎగరేసుకుపోకుండా ఉండాలంటే మనదగ్గరే పెట్టుకోవాలా.. మరెందుకు ఈ ముచ్చట. మరి గాలి పటానికి కట్టిన దారం కూడా బంగారందేనా? ఇలా ఎన్నో సందేహాలు మన బుర్రలో.

అయితే ఇది నిజం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అలాంటి ప్రత్యేకమైన గాలిపటం రూపొందించబడింది. ఇది కేవలం బంగారంతో తయారు చేశారు. మీరట్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన మంత్రులు సైతం బంగారు గాలిపటం చూసి ఆశ్చర్యపోయారు. ఈ గాలిపటాన్ని గాల్లో ఎగురవేయాలనే తాపత్రయ పడ్డారు. యూపీ ప్రభుత్వంలో ఎంఎస్‌ఎంఈ మంత్రిగా ఉన్న ఆర్కే సచన్ బంగారు గాలిపటం ఉన్న స్టాల్‌ను చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా బంగారంతో తయారు చేశారా అని అడిగి తెలుసుకున్నారు. బంగారు గాలిపటాన్ని కొద్ది క్షణాలు గాల్లో ఎగురవేసి ముచ్చటపడ్డారు.

బంగారు గాలిపటాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి ముఖంలో చిరునవ్వు మెరిసింది. తాను చాలా పతంగులను చూశానని, అయితే తొలిసారిగా బంగారు గాలిపటాన్ని చూశానని మంత్రి ఆర్కే సచ్చన్ అన్నారు. ఈసారి గణతంత్ర దినోత్సవం, వసంత పంచమి కలిసి వస్తున్నాయని బంగారు పతంగులు తయారు చేసే బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. అందువల్ల, మీరట్‌లోని థాపర్ నగర్‌లో బంగారు పతంగులు ఎగురవేయబడతాయి. ఇంతకీ ఈ గాలిపటం ధర ఎంతనుకుంటున్నారు.. అక్షరాలా ఇరవై ఒక్క లక్షలు. ధర విని అందరూ షాకవుతున్నారు.

బులియన్ వ్యాపారి అంకుర్ మాట్లాడుతూ.. 16 రోజుల్లో ఏడుగురు కళాకారులు ఈ గాలిపటాన్ని తయారు చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, దానిపై బంగారు పొర ఉంటుంది. దీని దారం కూడా బంగారంతో తయారు చేయబడింది అని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story