pre wedding photoshoot: పిచ్చి పీక్స్.. పెళ్లికి ముందు శవాల్లా తేలుతూ ఫోటోషూట్..

ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వైరల్
pre wedding photoshoot : మీ క్రియేటివిటీ తగలడా.. శుభమా అంటూ పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించే ముందు.. ఈ పిచ్చి ఆలోచన్లేంటి.. ఆ ఫోటో షూట్‌లేంటి.. ఇంట్లో పెద్దవాళ్లు ఎవరూ లేరా చెప్పేందుకు.. చావు పేరు చెబితే చచ్చేంత వణికిపోతుంటారు.. బతికుండగానే శవాల్లా.. ఫ్రీ వెడ్డింగ్ షూట్ అని దానికో పేరు.. ఏం సదువులో ఏంటో.. చదువుకోక ముందు కాకరకాయ అంటే చదువుకున్నాక కీకరకాయ అన్నట్టుంది మీ తెలివి తేటలు మండిపోను అని తిడుతున్నారు నెటిజన్స్ ఈ జంటను చూసి.. వీరికి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లుందని కామెంట్లు పెడతున్నారు.
నేటి యువత ఆలోచనల్లో ఒకర్ని మించి ఒకరు పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నారు. దేనికైనా కీడెంచి మేలెంచాలని అంటారు.. పొరపాటున జరగరానిది ఏదైనా జరిగితే.. వెరైటీ కోసం నీళ్లలో, కొండల్లో ఫోటో షూట్లు చేస్తున్నారు. అదృష్టం బావుంటే వైరల్ అవుతున్నారు. లేదంటే అడ్రస్ లేకుండా పోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫోటో షూట్ చూస్తే మనం కూడా అదే మాట అంటాం.
ఓ నదీ తీరంలో నల్ల దుస్తుల్లో ఓ జంట నీటిపై తేలుతూ కనిపించింది. వారిని చూసిన వాళ్లెవరైనా ఇద్దరూ కలిసి నదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారేమో అని అనుకుంటారు. కానీ ఇదంతా వారి క్రియేటివిటీనట. కాబోయే జంట ప్రీవెడ్డింగ్ ఫోటోషూట్.. 'లవర్స్ సూసైడ్' థీమ్‌లో ఈ ఫోటోలు తీసినట్లు తెలుస్తోంది. నెటిజన్ల తిట్లే దీవెనలుకుని పెళ్లి చేసుకుని హాయిగా జీవించమని పోస్టులు పెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com