Viral Video: ప్రియురాలితో షాపింగ్.. భార్య చేతిలో చెప్పుదెబ్బలు..

Viral Video: అసలే భార్యాభర్తలు ఇద్దరికీ పడక విషయం కోర్టు వరకు వెళ్లింది. విడాకులకు అప్లై చేశారు. అవి ఇంకా రాలేదు. విడిగానే ఉంటున్నారు. ఈలోపు ప్రియురాలితో కర్వాచౌత్ సందర్భంగా షాపింగ్ చేస్తున్నాడు. అదే సమయానికి భార్య తన స్నేహితులతో వచ్చింది.
నాకు లేని ఆనందం నీకు మాత్రం ఎందుకు దక్కాలి అనుకుందో ఏమో. కోపంతో ఊగిపోయింది. షాపులోనే భర్తని, అతడి ప్రియురాలిని ఉతికి ఆరేసింది. దుకాణానికి వచ్చిన కస్టమర్లకు ఫ్రీగా సినిమా చూపించారు. వీరి కొట్లాటని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఉత్తరాది పండుగ కర్వాచౌత్. ఈ సందర్భంగా తమ భర్త ముఖాన్ని అద్ధంలో చూసి వేడుక జరుపుకుంటారు మహిళలు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో కర్వా చౌత్ సందర్భంగా తన ప్రియురాలితో కలిసి షాపింగ్ చేస్తున్న వ్యక్తిని పట్టుకున్న వ్యక్తిని అతని భార్య మార్కెట్‌లో కొట్టింది. భార్య తన స్నేహితులతో కలిసి భర్త కాలర్ పట్టుకుని కొట్టింది. మార్కెట్‌లో భార్య చెప్పులు తీసి భర్తను, ప్రియురాలిని తీవ్రంగా కొట్టడంతో పెద్ద ఎత్తున జనం గుమిగూడారు.
దుకాణదారుడు బయటకు వెళ్లి కొట్టుకోండి. షాపులో న్యూసెన్స్ చేయొద్దని గట్టిగా అరవడంతో విషయం సద్ధుమణిగింది. ప్రీతికి 2017 సంవత్సరంలో రాహుల్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఇద్దరి మధ్య తరచు గొడవలు జరగుతుండడంతో గత మూడేళ్లుగా ప్రీతి తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. వీరిద్దరి మధ్య వివాదానికి సంబంధించిన పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉంది.
#पुरुष वर्ग कृपया ध्यान दे..
— Yogesh Tiwari (@yogirishuNBT) October 13, 2022
आज घर वाली पर ही संपूर्ण आस्था केंद्रित रखें. अन्यथा..
गाजियाबाद तुराबनगर मार्केट में करवाचौथ के दिन दूसरी महिला को शॉपिंग करवा रहा था पति. पत्नी ने मार्केट में रंगे हाथों पकड़ा..फिर क्या हुआ विडियो में देखें. pic.twitter.com/M7byodsbCB
తన భర్తకు వేరే మహిళతో సంబంధాలు ఉన్నాయని, తనను తనతో తీసుకెళ్లకుండా ఒంటరిగా జీవిస్తున్నాడని ప్రీతి ఆరోపించింది. గురువారం కర్వా చౌత్ సందర్భంగా రాహుల్ తన ప్రియురాలితో కలిసి షాపింగ్ చేస్తున్నాడు. అదేసమయానికి ప్రీతి కూడా తన తల్లితో షాపింగ్‌కి వచ్చింది. భర్తని చూడగానే ఒళ్లు మండిపోయింది ప్రీతికి. కోపంతో అతడిని చెప్పుతో కొట్టింది. ప్రియురాలిని జుట్టు పట్టి లాగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com