VIRAL VIDEO: షూలో దాక్కున్న నాగు పాము.. బుసలు కొడుతూ హల్ చల్..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇళ్లలోకి పాములు చాలా ఈజీగా వచ్చేస్తుంటాయి. ఎక్కడో బయట ఉండాల్సిన విషసర్పాలు ఇంట్లో కళ్ల ముందే కనిపిస్తే ఇక ఆ ఇంట్లో వారి టెన్షన్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇలాంటి ఘటనే ఓ ఇంట్లో వెలుగుచూసింది. తన చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన మహిళ లోపల నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది.
విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు షూ నుంచి పామును బయటకు తీశారు. IFS అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపామును వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శిక్షణ పొందిన సిబ్బందికి తెలియజేసి సహాయం తీసుకోండి అంటూ సుశాంతనంద సూచించారు.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
— Susanta Nanda IFS (@susantananda3) July 11, 2022
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS
షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు లక్ష వ్యూస్‌తో పాటు 3,400 మంది లైక్ చేశారు. భయంకరమైన ఈ వీడియోను పంచుకున్నందుకు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంతకు నెటిజన్లు కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com