Viral Video: ఎగురుతున్న దెయ్యం..చూస్తే భయపడతారు

scarecrow Video Goes Viral in Social Media
Twitter Image
Scarecrow: సాదారణంగా పంటపొలాల్లో రైతులు అడవి పందులు, ఇతర జంతువుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మను పెడతారు.

Scarecrow: సాధారణంగా పంటపొలాల్లో రైతులు అడవి పందులు, ఇతర జంతువుల నుంచి తమ పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మను పెడతారు. ఇక్కడ ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. ఆ రైతు తన పంటను రక్షించుకొనేందుకు ఓ దిష్టిబొమ్మను ఏర్పాటు చేశాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అక్కడే అసలు మ్యాటర్ ఉంది. ఆ బొమ్మకు గ్రీన్ కలర్ చొక్కా, బ్లూ కలర్ లంగా, నెత్తిన కండువాతో భయానక ముఖంతో తయారుచేశాడు. ఒక స్వింగ్, దానికి సైకిల్ హ్యాండిల్ ఏర్పాటు చేసి ఆ బొమ్మను అక్కడ ఉంచాడు. దీంతో బొమ్మ కాస్తా గాల్లో ఆటూ, ఇటూ ఎగురుతూ ఉంది. ఈ దిష్టిబొమ్మను చూసిన ఓ నెటిజన్ 'Next level Scarecrow' అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తొమ్మిది సెంకడ్లు ఉన్న దెయ్యం దిష్టిబొమ్మ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి.

అంతేకాదు ఈ దిష్టిబొమ్మను చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఐతే ఈ బొమ్మను చూసి మొదట మనిషి అనుకున్నా.. బాగా గమనిస్తే తెలిసింది దిష్టిబొమ్మని అని పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ ఈ బొమ్మ పగలు చూస్తేనే భయంగా ఉంది.. రాత్రి చూస్తే చెప్పలేమ్ బాబోయ్ అటూ కామెంట్ పెట్టాడు. ఇంతలా భయపెట్టే దెయ్యం దిష్టిబొమ్మను మీరు కూడా చూడండి.


Also Read: బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ చేస్తున్నారా? అలా చేయకండి..ఎందుకంటే..?


Tags

Next Story