Viral Video: ఒకే గొడుగులో మేమిద్దరం.. మా బంధం భద్రం..

Viral Video: ఒకే గొడుగులో మేమిద్దరం.. మా బంధం భద్రం..
Viral Video: అన్యోన్యదాంపత్యానికి ఈ ఆలూమగలు చిరునామాగా నిలుస్తారు. భార్య ఇంట్లో ఉండి ఆర్డర్స్ వేస్తే విసుక్కుంటూ బయటకు వెళ్లి కొనుక్కొచ్చే భర్త కాదు ఈయన..

Viral Video: అన్యోన్యదాంపత్యానికి ఈ ఆలూమగలు చిరునామాగా నిలుస్తారు. భార్య ఇంట్లో ఉండి ఆర్డర్స్ వేస్తే విసుక్కుంటూ బయటకు వెళ్లి కొనుక్కొచ్చే భర్త కాదు ఈయన.. ఇంట్లోకి ఏం కావాలో ఇద్దరం కలిసే వెళ్లి తెచ్చుకుందాం పద అని ఆమెనీ బయల్దేరదీశారు.

ఒక్కరే వెళ్లొచ్చు కదా పైగా వర్షం కూడా పడుతోంది అంటే.. భలేదానివి నిన్ను తడవనిస్తానా ఏంటి.. నీ మీద ఒక్క చినుకు కూడా పడకుండా నే చూసుకుంటా.. రావోయ్ అంటూ ఆమెకి తన చేయి అందించారు.

ఇద్దరూ కలిసి చిరు జల్లులు కురుస్తుండగా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్న ఈ జంటను చూసి కెమెరా క్లిక్ అంది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి క్యూట్ కపుల్ అని నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు..

అంకుల్, ఆంటీ రోడ్డు దాటుతున్న ఈ క్రేజీ వీడియో వైరల్ అవుతోంది. భార్య కోసం గొడుగు పట్టుకొని అతను నడుస్తుంటే, చేతిలో సంచి పట్టుకుని ఆమె అతడిని అనుసరిస్తోంది. ఈ వీడియోతో పాటు ABCDEFU పాటకు రొమాంటిక్ వెర్షన్ అయిన టైలర్ షా రచించిన లవ్ యు స్టిల్ ట్రెండింగ్ సాంగ్ ప్లే అవుతోంది.

ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ మరియు కంటెంట్ సృష్టికర్త ఆసిఫ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పంచుకున్నారు. "ఏదీ లేని ప్రపంచంలో ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచే ఉంటుంది. చూడముచ్చటైన జంట చూపరులను మంత్రముగ్దులను చేస్తోంది" అని అతను క్యాప్షన్‌లో రాశాడు. ఈ వీడియోను ఇప్పటివరకు 27 మిలియన్లకు పైగా వీక్షించారు. 2.6 మిలియన్ లైక్‌లు వచ్చాయి. ఇలాంటివి చూస్తే నిజమైన ప్రేమకు అర్థం ఇదే అనిపిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story