viral : గుడ్ హజ్బెండ్.. ఆట మధ్యలో అనుష్కని..

viral : గుడ్ హజ్బెండ్.. ఆట మధ్యలో అనుష్కని..
ఎంత ప్రేమ.. అలా ఉండాలి హజ్బెండ్ అంటే అనుష్క వాళ్ల ఆయనలాగా.. అనుకుంటారు అమ్మాయిలంతా కోహ్లీని చూసి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న..

ఎంత ప్రేమ.. అలా ఉండాలి హజ్బెండ్ అంటే అనుష్క వాళ్ల ఆయనలాగా.. అనుకుంటారు అమ్మాయిలంతా కోహ్లీని చూసి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కోహ్లీ అభిమానులను ఆకట్టుకుంటోంది. అసలే అనుష్క అమ్మ కాబోతోంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. టైమ్‌కి తినాలి. ఆ బాధ్యత అంతా భర్తగా విరాట్ కోహ్లీ వంద శాతం నిర్వర్తిస్తున్నట్టున్నాడు.. అందుకే ఆట మధ్యలో విరామం వస్తే సైగల ద్వారానే సఖిని అడిగాడు తిన్నావా అని. అందుకు ఆమె ఎస్ అన్నట్టు థమ్స్ అప్ సింబల్ చూపించింది.

అయితే మ్యాచ్‌ సమయంలో మైదానంలో ఉన్న కోహ్లీ గ్యాలరీలో కూర్చున్న తన భార్య అనుష్కపై చూపించిన ప్రేమాభిమానాలకు నెటిజన్లను ఫిదా అవుతున్నారు. కొందరు నెటిజన్లు.. భార్యపై ఎంత ఘాటు ప్రేమయో అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు భార్యభర్తల ప్రేమను ఈ వీడియో గుర్తు చేస్తుందంటూ కామెంటు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇదిలావుంటే కెప్టన్ కోహ్లీ, అనుష్క దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌ ఆరంభానికి ముందే అనుష్క ప్రెగ్నెంట్‌ అన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు కోహ్లీ.

Tags

Read MoreRead Less
Next Story