Viral: సోషల్‌ మీడియాను ఏలుతున్న ఈ బడుద్దాయి ఎవరేంటే.....

Viral: సోషల్‌ మీడియాను ఏలుతున్న ఈ బడుద్దాయి ఎవరేంటే.....
X
ప్రపంచాన్ని ఏలేస్తున్న ఈ సోషల్‌ మీడియా దిగ్గజం ఎవరంటే

ఈ ఫొటోలో క్యూట్‌గా కనిపిస్తూ నవ్వుతున్న ఈ బాబును గుర్తుపట్టారా ఇతను లక్షల కోట్ల రూపాయల ఆస్తికి అధిపతి, ఒక్క ట్వీట్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించగల నేర్పరి, వినూత్న ఆవిష్కరణలతో అందరిని తన వైపునకు తిప్పుకునే మేధావి. సోషల్‌ మీడియాను దున్నేస్తున్న అసలైన నెటిజన్‌. ఏదో ఒక వార్తతో నిత్యం వార్తలు ఉండే సెలబ్రెటీ. రోజుకు 18 గంటలపాటు పనిచేసే పని రాక్షసుడు... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఉపోద్ఘాతం ఓ చాంతడంతా అవుతుంది... ఇంతకీ ఈ ప్రపంచ కుబేరుడు ఎవరంటే...


ఈ చిన్ననాటి ఫొటోలో చిరునవ్వుతో ప్రపంచాన్ని ఏలేందుకు సిద్ధంగా ఉన్నాను అనేలా ఉన్నది టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌. ఇలా ఎలాన్‌ ఫొటో ఆన్‌లైన్‌లో కనిపంచగానే అలా వైరల్‌ అయిపోయింది. నెటిజన్లు, సెలబ్రెటీలు క్యూట్‌ అంటూ తెగ పొగిడేస్తున్నారు.

బేబీ ఎలాన్‌ చిన్ననాటి ఫొటోను మీరు చూశారా అని ప్రతి ఒక్కరూ ఈ ఫొటోను రీ ట్వీట్‌ చేసేస్తున్నారు. కార్ ఫార్ట్ ఆవిష్కర్తగా మారే ఈ చిన్నారి.. అంగారక గ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని... ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచవ్యాప్తంగా రోడ్లపై పరిగెత్తించేలా చేస్తాడంటూ ఓ నెటిజన్‌ మస్క్‌ ఫొటోకు ట్వీట్‌ చేశాడు.


ఈ ఫొటో అలా అలా మస్క్‌ దగ్గరికి కూడా చేరింది. దీనిపై స్పందించిన ఎలాన్‌ తాను పిచ్చివాడిలా కనిపిస్తున్నానని రిప్లై ఇచ్చాడు. మస్క్‌ చిన్నపటి ఫొటోను ఇప్పటివరకూ 16 లక్షలమంది చూశారు. ఈ ఫొటో మస్క్‌కు 7 నుంచి 12 నెలల మధ్య వయసున్నప్పుడు తీసినట్లు కనిపిస్తోంది.

ఎలాన్ మస్క్ 28 జూన్ 1971న దక్షిణాఫ్రికాలో జన్మించాడు. అతనికి దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా మూడు దేశాల్లో ఆయనకు పౌరసత్వం ఉంది. అతని తండ్రి ఎర్రోల్ మస్క్ ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీర్, తల్లి మాయె మస్క్ మోడల్ అండ్ డైటీషియన్. 1995లో పీహెచ్‌డీ చేసేందుకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి వెళ్లారు. అక్కడి స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అతను రెండు రోజుల తర్వాత వెళ్లిపోయాడు. అలాన్ 27 ఏళ్ల వయసులో ‘X.com’ అనే కంపెనీని స్థాపించాడు. ఇది డబ్బు బదిలీ సంస్థ. ఈ సంస్థను నేడు ‘పే పాల్’ అని పిలుస్తారు. 2002 సంవత్సరంలో ఈ కంపెనీని eBay అనే వ్యక్తి 165 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.


అలెన్ 2002లో స్పేస్ ఎక్స్ పేరుతో మరో కంపెనీని స్థాపించాడు. ఈ కంపెనీ 31 మే 2020న ప్రపంచంలోని మొట్టమొదటి ప్రైవేట్ మానవ మిషన్‌ను ప్రారంభించింది. మస్క్‌ పునర్వినియోగ రాకెట్ సాంకేతికతను అభివృద్ధి చేశాడు. తద్వారా శాటిలైట్ లాంచింగ్, ఇతర అంతరిక్ష యాత్రలకు తక్కువ ఖర్చు ఉంటుంది. ఎలోన్ నికర విలువ ప్రస్తుతం 219 బిలియన్ డాలర్లు అంటే రూ.18 లక్షల కోట్లు. 2020లో అతని నికర విలువ దాదాపు 30 బిలియన్ డాలర్లు అంటే రూ. 245 కోట్లు.

Tags

Next Story