ప్రియురాలితో భర్త.. చెప్పుతో కొట్టి ఉతికారేసిన భార్య..!
Madhya Pradesh : ఓ మహిళ తన భర్త మరో మహిళతో జిమ్‌లో ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని చితకొట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఖానుగౌన్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల ఉర్బ షాహి, భర్త తల్హా షమీమ్‌తో కలిసి ఉంటోంది. అయితే తన భర్త మునుపటిలాగా ఉండడం లేదని, ప్రవర్తనలో మార్పు వచ్చిందని అనుమానించింది.
అనుమానంతో భర్త కదలికల పైన కన్నేసింది.. ఓ రోజు తన భర్త మరో అమ్మాయితో జిమ్ లో సరదాగా ఉండడం చూసింది. చూసి తట్టుకోలేకపోయింది. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో తన భర్త పక్కనే ఉన్న సదరు మహిళను ఏకంగా జిమ్ లోనే చెప్పుతో కొట్టింది. దీనిని అడ్డుకోబోయిన భర్తను కూడా కొట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకొని వారిని శాంతపరిచారు.
ఆ మహిళతో తనకి ఎలాంటి ఎఫైర్ లేదని కేవలం ఆమె తనకి స్నేహితురాలు మాత్రమేనని అతను పోలీసులకి వెల్లడించాడు. అనంతరం మహిళ, ఆమె భర్త ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా దీనికి ముందే సదరు మహిళ తన భర్త పైన వరకట్న వేధింపుల కింద, అత్తమామలపైన కేసును నమోదు చేసింది. దీనికి సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com