Nandigama: రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మంగాలు కోసేసిన భార్య
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఒక వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చాయి. మొదటి భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్చ్ చూస్తున్నాడని రెండో భార్య భర్త మర్మాంగాలను(Woman Attacks her husbend) కోసేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు, వరమ్మ దంపతులు. ఆనంద్‌బాబుకు ఇదివరకే పెళ్లికాగా మనస్పర్థల కారణంగా విడిపోయారు. అనంతరం ఐదేళ్ల క్రితం వరమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు.
అప్పటినుంచి ముప్పాళ్ల గ్రామంలోనే ఉంటున్న ఆనంద్‌బాబు, వరమ్మ దంపతులు అయిదు నెలల కిందే నందిగామకు మకాం మార్చారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నారు. నిన్న రాత్రి ఫోన్‌లో ఆనంద్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో మొదటి భార్య రీల్స్ చూడడం వరమ్మ చూసింది. మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ ఎందుకు చూస్తున్నావంటూ భర్తను ప్రశ్నించింది వరమ్మ. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ గొడవతో తీవ్ర ఆవేశానికి లోనైన వరమ్మ... భర్త మర్మాంగాలను బ్లేడ్‌తో కోసేసింది. తీవ్ర రక్తస్రావం కావడం తో నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మరింత మెరుగైన వైద్యం కోసం విజయవాడకు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com